Telugu Global
Cinema & Entertainment

అర్జున ఫాల్గుణ టీజర్ రివ్యూ

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే మంచి కథలు ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ఇలాంటి బ్యానర్ పై హీరో శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. అర్జున ఫల్గుణ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు. మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. […]

అర్జున ఫాల్గుణ టీజర్ రివ్యూ
X

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే మంచి కథలు ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ఇలాంటి బ్యానర్ పై హీరో శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. అర్జున ఫల్గుణ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను ఈరోజు విడుదల చేశారు.

మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు. ‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65 సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు.

టీజర్ లో డైలాగ్స్, విజువల్స్ అన్నీ బాగున్నాయి. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. రాజ రాజ చోర లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అర్జున్ ఫాల్గుణపై అంచనాలు పెరిగాయి.

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. సుధీర్ వర్మ మాటలు అందించారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

First Published:  9 Nov 2021 4:45 AM GMT
Next Story