Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండ తొలి సంపాదన

ఎన్నో కష్టాలు పడి ఇప్పుడున్న పొజిషన్ కు చేరాడు విజయ్ దేవరకొండ. తన కష్టాల్ని ఎన్నో సందర్భాల్లో బయటపెట్టాడు కూడా. డబ్బులు కూడా తీసుకోకుండా చాలా ప్రాజెక్టులకు వర్క్ చేశాడు. మరి విజయ్ దేవరకొండ ఫస్ట్ సంపాదన ఎంత? ఆయన తొలిసారి ఆర్జించిన సందర్భం ఏంటి? “అమ్మకు చెందిన ట్యూషన్ సెంటర్ లో ఓసారి క్లాస్ చెబితే 500 రూపాయలు వచ్చాయి. అదే నా తొలి సంపాదన. ఆ తర్వాత చిన్న పిల్లలకు యాక్టింగ్ నేర్పించే పని […]

విజయ్ దేవరకొండ తొలి సంపాదన
X

ఎన్నో కష్టాలు పడి ఇప్పుడున్న పొజిషన్ కు చేరాడు విజయ్ దేవరకొండ. తన కష్టాల్ని ఎన్నో సందర్భాల్లో బయటపెట్టాడు కూడా. డబ్బులు కూడా తీసుకోకుండా చాలా ప్రాజెక్టులకు వర్క్ చేశాడు. మరి విజయ్ దేవరకొండ ఫస్ట్ సంపాదన ఎంత? ఆయన తొలిసారి ఆర్జించిన సందర్భం ఏంటి?

“అమ్మకు చెందిన ట్యూషన్ సెంటర్ లో ఓసారి క్లాస్ చెబితే 500 రూపాయలు వచ్చాయి. అదే నా తొలి సంపాదన. ఆ తర్వాత చిన్న పిల్లలకు యాక్టింగ్ నేర్పించే పని చేశా. 2 నెలలు యాక్టింగ్ నేర్పించి వాళ్లతో స్కూల్ లో ఓ నాటకం డైరక్ట్ చేశాను. అప్పుడు 35వేలు ఇచ్చారు. నా లైఫ్ లో బిగ్ మనీ అదే. ఆ టైమ్ లో అంత డబ్బుతో ఏం చేయాలో కూడా తెలియలేదు నాకు. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో వర్క్ చేసినందుకు 20వేలు ఇచ్చారు.”

ఇలా తన తొలి సంపాదన వెనక సంగతుల్ని నెమరువేసుకున్నాడు విజయ్ దేవరకొండ. సినిమాకు 20వేల రూపాయలు తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు. ప్రత్యేక విమానంలో తిరుగుతున్నాడు. సొంతంగా ఓ ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టాడు.

First Published:  8 Nov 2021 6:17 AM GMT
Next Story