Telugu Global
NEWS

సోనూసూద్ అంటే వారికి భయం.. అందుకే ఐటీదాడులు..

సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే.. ఆయనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ పరోక్షంగా కేంద్రంపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సోనూ సూద్ ఇంటిపై ఐటీదాడులు జరగడానికి కూడా కారణం అదేనని చెప్పారు. సోనూ సూద్ రాజకీయాల్లోకి రాకూడదనే ఆయనపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించి బెదిరించాలని చూశారని విమర్శించారు. హైదరాబాద్ లో కొవిడ్ వారియర్ల సన్మాన కార్యక్రమంలో సోనూ సూద్ తో కలసి పాల్గొన్న కేటీఆర్.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు సంధించారు. కరోనా లాక్ […]

సోనూసూద్ అంటే వారికి భయం.. అందుకే ఐటీదాడులు..
X

సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారనే భయంతోనే.. ఆయనపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారంటూ పరోక్షంగా కేంద్రంపై మండిపడ్డారు తెలంగాణ మంత్రి కేటీఆర్. సోనూ సూద్ ఇంటిపై ఐటీదాడులు జరగడానికి కూడా కారణం అదేనని చెప్పారు. సోనూ సూద్ రాజకీయాల్లోకి రాకూడదనే ఆయనపై ఐటీ దాడులు, ఈడీ దాడులు చేయించి బెదిరించాలని చూశారని విమర్శించారు. హైదరాబాద్ లో కొవిడ్ వారియర్ల సన్మాన కార్యక్రమంలో సోనూ సూద్ తో కలసి పాల్గొన్న కేటీఆర్.. పరోక్షంగా బీజేపీపై విమర్శలు సంధించారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలకు సోనూ సూద్ చేసిన సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడారు. అలాంటి వ్యక్తి ఢిల్లీ ప్రభుత్వంతో కలసి ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పడంతో వెంటనే ఆయనపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తే, తమకు డిపాజిట్లు గల్లంతనే ఉద్దేశంతోటే ఆయనపై కక్షగట్టారని అన్నారు కేటీఆర్.

అలాంటి వారికి సోనూ సూద్ భయపడాల్సిన అవసరం లేదని ఆయనకు తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేటీఆర్. సోనూ సూద్ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. సోనూకి తమ మద్దతు ఉంటుందని చెప్పారు. కరోనా కష్టకాలంలో సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారని చెప్పారు కేటీఆర్. కొవిడ్‌ కారణంగా చాలా మంది చదువులు, ఉద్యోగాలు, ఆత్మీయులను కోల్పోయారని… అలాంటి వాళ్లకు సహాయపడటం చాలా గొప్ప విషయం అని అన్నారు. విపత్తు సమయాల్లో ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను నిర్వహించలేదని, అలాంటి సమయాల్లో స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతో అవసరమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

First Published:  8 Nov 2021 4:32 AM GMT
Next Story