Telugu Global
International

ఫేస్ బుక్ కి షాక్.. మెటా పేరుపై కోర్టుకెక్కిన సాఫ్ట్ వేర్ సంస్థ..

ఫేస్ బుక్ పేరుని మెటాగా మారుస్తున్నట్టు ఇటీవల యజమాని మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెటావర్స్ అనే సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో పేరు మార్చుతున్నట్టు ఆయన బహిరంగ ప్రకటన చేశారు. అయితే మెటా అనేది తమ ట్రేడ్ మార్క్ అని, దాన్ని ఫేస్ బుక్ కి ఇచ్చేది లేదని, బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించింది చికాగోకి చెందిన మెటా అనే సాఫ్ట్ వేర్ సంస్థ. సదరు సంస్థ అధినేత నటే స్కులిక్ పేరు […]

ఫేస్ బుక్ కి షాక్.. మెటా పేరుపై కోర్టుకెక్కిన సాఫ్ట్ వేర్ సంస్థ..
X

ఫేస్ బుక్ పేరుని మెటాగా మారుస్తున్నట్టు ఇటీవల యజమాని మార్క్ జుకెర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మెటావర్స్ అనే సాంకేతికతను అందిపుచ్చుకునే క్రమంలో పేరు మార్చుతున్నట్టు ఆయన బహిరంగ ప్రకటన చేశారు. అయితే మెటా అనేది తమ ట్రేడ్ మార్క్ అని, దాన్ని ఫేస్ బుక్ కి ఇచ్చేది లేదని, బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించింది చికాగోకి చెందిన మెటా అనే సాఫ్ట్ వేర్ సంస్థ. సదరు సంస్థ అధినేత నటే స్కులిక్ పేరు మార్పు వ్యవహారంపై కోర్టు కెక్కారు.

ఆఫర్ వద్దన్నాం.. అయినా..
గత కొంతకాలంగా ఫేస్ బుక్ కి చెందిన న్యాయవాదులు తమ బ్రాండ్ ని అమ్మేయాలంటూ తమ చుట్టూ తిరిగారని, అయితే తాము కుదరదు పొమ్మని చెప్పామని వివరించారు మెటా సంస్థ ప్రతినిధులు. చివరకు బహిరంగంగా ప్రకటన చేసి తమ వద్ద బలవంతంగా బ్రాండ్ పేరు లాగేసుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మెటా కంపెనీ మాది..
2016లో చికాగోకి చెందిన మెటా కంపెనీ ట్రేడ్ మార్క్ సంపాదించింది. అప్పటి నుంచి న్యాయబద్ధంగా తాము సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నామని, కానీ ఫేస్ బుక్ సంస్థ అన్యాయంగా తమ పేరుని తీసుకోవాలని కుటిల పన్నాగాలు పన్నిందని ఆరోపిస్తోంది మెటా సంస్థ యాజమాన్యం. ఫేస్ బుక్ చర్యలను తీవ్రంగా ఖండించింది. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటి వరకు ఫేస్ బుక్ స్పందించలేదు.

First Published:  7 Nov 2021 7:59 AM GMT
Next Story