Telugu Global
Cinema & Entertainment

మహేష్ మూవీ షూటింగ్ అప్ డేట్

పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా స్పెయిన్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఓ సాంగ్ తో పాటు, కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అలా స్పెయిన్ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన యూనిట్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ మొదలైంది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై […]

మహేష్ మూవీ షూటింగ్ అప్ డేట్
X

పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా స్పెయిన్ లో ఓ భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. ఓ సాంగ్ తో పాటు, కొన్ని కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అలా స్పెయిన్ షెడ్యూల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన యూనిట్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో షెడ్యూల్ స్టార్ట్ చేసింది.

ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో సర్కారువారి పాట కొత్త షెడ్యూల్ మొదలైంది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. రేపట్నుంచి మహేష్ బాబు సెట్స్ లో జాయిన్ అవుతాడు. ఈ షెడ్యూల్ పూర్తయిన వెంటనే, ఏమాత్రం గ్యాప్ లేకుండా వెంటనే రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ అవుతుంది యూనిట్. అక్కడ ఆల్రెడీ ఓ స్పెషల్ సెట్ వేశారు. అందులో మహేష్-కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీయబోతున్నారు.

మరో 2 నెలల్లో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తిచేయాలని నిర్ణయించారు. సంక్రాంతికి కాస్త గ్యాప్ తీసుకొని, సంక్రాంతి తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు మహేష్. సర్కారువారి పాట సినిమాను ఏప్రిల్ 1న థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  7 Nov 2021 12:33 AM GMT
Next Story