Telugu Global
National

అంధకారంలో చెన్నై.. భారీ వ‌ర్షాల‌తో స్తంభించిన జనజీవనం..!

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీటమునిగింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. మెట్రో రైళ్ల సేవలను నిలిపి వేశారు. వర్షం కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో నగరమంతా అంధకారంలో మునిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర ఉన్నతాధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వర్ష బాధితులకు షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో […]

అంధకారంలో చెన్నై.. భారీ వ‌ర్షాల‌తో స్తంభించిన జనజీవనం..!
X

కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం నీటమునిగింది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. మెట్రో రైళ్ల సేవలను నిలిపి వేశారు. వర్షం కారణంగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో నగరమంతా అంధకారంలో మునిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్, ఇతర ఉన్నతాధికారులు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

వర్ష బాధితులకు షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.చెన్నై న‌గ‌రానికి నీటిని అందించే చెంబరబాక్కం, పుళల్ రిజర్వాయర్లు నిండుకుండలా మారడంతో గేట్లు తెరవనున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అథారిటీ సూచించింది. 2015 నుంచి నగరంలో ఇంత భారీ వర్షాలు చూడలేదని ప్రైవేటు వెదర్ బ్లాగర్స్ చెబుతున్నారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురుస్తుండగా నవంబర్ 10 వరకూ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒక చెన్నైలోనే కాదు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధురై, రామేశ్వరం ప్రాంతాల్లో కూడా వర్షంతో జనజీవనం స్తంభించింది. మరోవైపు చెన్నై కి ఆనుకొని ఉన్న ఏపీ జిల్లాలైన చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

First Published:  7 Nov 2021 10:11 AM GMT
Next Story