Telugu Global
Business

డిజిటల్ న్యూస్.. కోట్లు తెచ్చిపెడుతున్న వ్యూస్..

ప్రింట్ మీడియాని టీవీ మీడియా అధిగమించినట్టే.. ఇప్పుడు ఆ రెండిటి స్థానాన్ని డిజిటల్ మీడియా ఆక్రమిస్తోంది. భారత్ లో కూడా డిజిటల్ మీడియా ప్రాధాన్యం బాగా పెరిగింది. 2016లో 15కోట్ల మంది ఆన్ లైన్ లో న్యూస్ చూసేవారు ఉంటే.. ఈ ఏడాది జులై నాటికి వారి సంఖ్య 46కోట్ల 10లక్షలకు చేరుకుంది. ఆన్ లైన్ పాఠకుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. పాఠకులు సరే.. ఆదాయం ఎలా.. ఆన్ లైన్ లో అంతా […]

డిజిటల్ న్యూస్.. కోట్లు తెచ్చిపెడుతున్న వ్యూస్..
X

ప్రింట్ మీడియాని టీవీ మీడియా అధిగమించినట్టే.. ఇప్పుడు ఆ రెండిటి స్థానాన్ని డిజిటల్ మీడియా ఆక్రమిస్తోంది. భారత్ లో కూడా డిజిటల్ మీడియా ప్రాధాన్యం బాగా పెరిగింది. 2016లో 15కోట్ల మంది ఆన్ లైన్ లో న్యూస్ చూసేవారు ఉంటే.. ఈ ఏడాది జులై నాటికి వారి సంఖ్య 46కోట్ల 10లక్షలకు చేరుకుంది. ఆన్ లైన్ పాఠకుల సంఖ్య భారీగా పెరుగుతోందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

పాఠకులు సరే.. ఆదాయం ఎలా..
ఆన్ లైన్ లో అంతా ఉచితం. ఎవరు ఏ సమాచారం కావాలన్నా గూగుల్ లో వెదకడమో లేక, యూట్యూబ్ లో సెర్చ్ చేయడమో చేస్తుంటారు. కానీ డిజిటల్ మీడియాకు ఇలాంటి ఉచితాలు ఎక్కువకాలం ఉపయోగపడవు. కానీ భారత్ లో డిజిటల్ మీడియా చందాదారుల సంఖ్య మాత్రం అంతంతమాత్రమే. 46కోట్లమందికి పైగా ఆన్ లైన్ లో న్యూస్ చదువుతున్నా కేవలం 10లక్షలమంది మాత్రమే వారిలో చందాదారులుగా ఉంటున్నారు. ఓటీటీలాంటి ఎంటర్టైన్ మెంట్ ప్లాట్ ఫామ్స్ కి మాత్రం 6కోట్లమంది చందాదారులు ఉండటం విశేషం.

సబ్ స్క్రైబర్స్ ని సాధించుకున్నా.. వారిని నిలబెట్టుకోవడం, కొనసాగేలా చేయడం కత్తిమీద సాములా మారుతుందని అంటున్నారు డిజిటల్ మీడియా నిర్వాహకులు. డబ్బులిచ్చి పేపర్ వేయించుకుంటారు కానీ, ఆన్ లైన్ లో డబ్బులిచ్చి వార్తలు చదివే వారు మాత్రం బాగా అరుదు. ఇలాంటి కష్టాలను కాస్తో కూస్తో ఆన్లైన్ అడ్వర్టైజ్ మెంట్లు తీరుస్తున్నాయి. ద న్యూస్ మినిట్.. కేవలం 5 దక్షిణాది రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టి వార్తలను అందించేది. ఆరేళ్ల తర్వాత లాభాలను ఆర్జించడం మొదలు పెట్టింది. ద క్వింట్ గ్రూప్ ఈ ఏడాది 22కోట్ల రెవెన్యూ సంపాదించింది. తక్కువ నిడివి గల కథనాలు అందించే ఇన్ షార్ట్స్ గ్రూప్ 60వేలమంది తమ ప్లాట్ ఫామ్ వాడుకునేలా చేయగలిగింది. 2021 మార్చి నాటికి ఇన్ షార్ట్స్ ఆదాయం 102 కోట్లు. వచ్చే ఏడాదికి పరిస్థితులు అనుకూలిస్తే 160కోట్ల ఆదాయాన్ని అందుకోగలమని నమ్మకంగా చెబుతున్నాడు ఇన్ షార్ట్స్ అధినేత పాతికేళ్ల యువకుడు అజార్ ఇక్బాల్.

భారత్ లో డిజిటల్ న్యూస్ విప్లవం మొదలైంది. 2017 డిసెంబర్ నాటికి.. కేవలం రెండు మూడు సంస్థలు మాత్రమే డిజిటల్ న్యూస్ విభాగంలో రాణించేవి. ఈ ఏడాది జులై నాటికి దాదాపు 10 సంస్థలు డిజిటల్ వ్యూస్ ని భారీగా పెంచుకోగలిగాయి. పోటీలో నిలబడ్డాయి. భారత్ లో ప్రింట్ మీడియా కనుమరుగై, టీవీ మీడియాకి క్రేజ్ తగ్గి.. డిజిటల్ మీడియా రాజ్యమేలడానికి ఎన్నో రోజుల సమయం పట్టదని తెలుస్తోంది.

First Published:  6 Nov 2021 6:22 AM GMT
Next Story