Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ నుంచి మరో సినిమా రెడీ

మినిమం గ్యాప్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. శ్రీకారం వచ్చిన కొన్ని రోజులకే మహాసముద్రం సినిమాను విడుదల చేశాడు. మహాసముద్రం తర్వాత మరో మూవీని సిద్ధం చేశాడు. అదే ఒకే ఒక జీవితం. శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైన్స్ ఫిక్షన్ […]

శర్వానంద్ నుంచి మరో సినిమా రెడీ
X

మినిమం గ్యాప్స్ లో సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు శర్వానంద్. శ్రీకారం వచ్చిన కొన్ని రోజులకే మహాసముద్రం సినిమాను విడుదల చేశాడు. మహాసముద్రం తర్వాత మరో మూవీని సిద్ధం చేశాడు. అదే ఒకే ఒక జీవితం. శర్వానంద్ కెరీర్‌ లో 30వ సినిమాగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ప్రకాష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామా, సైన్స్ ఫిక్షన్ సినిమాకు తరుణ్ భాస్కర్‌ మాటలు అందించాడు.

ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ కాపీ దాదాపు రెడీ అయింది. కావాలనుకుంటే డిసెంబర్ లో రిలీజ్ చేసేయొచ్చు. కానీ బడా సినిమాలతో పోటీ ఏర్పడుతుంది. అందుకే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు.

ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో అక్కినేని అమల గోడపై కూర్చుని ఉన్నారు. శర్వానంద్, అతని తమ్ముడు అమ్మ ఒడిలో తల పెట్టుకుని అలా సేద తీరుతున్నారు. ఈ పోస్టర్‌తో సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.

తెలుగమ్మాయి రీతూ వర్మ ఈ చిత్రంలో శర్వానంద్ పక్కన హీరోయిన్‌గా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ చిత్రంలో భాగం అయ్యారు.

First Published:  5 Nov 2021 7:35 AM GMT
Next Story