Telugu Global
National

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కేంద్రం.. పెట్రోల్ రేట్లపై విమర్శల వర్షం..

దీపావళి పండగ సందర్భంగా పెట్రోలు రేట్లపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. దీంతో లీటర్ పెట్రోలు రేటు 5 రూపాయలు, డీజిల్ రేటు 10 రూపాయల మేర తగ్గింది. అయితే ఏడాది కాలంలో లీటర్ పెట్రోల్ రేటు 28 రూపాయలు పెంచి, ఇప్పుడు కంటి తుడుపుగా 5 రూపాయలు తగ్గించడంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కేవలం ఉప ఎన్నికల ఫలితాలు చూసి భయపడిన కేంద్రం రేట్లు తగ్గించిందని, వచ్చే ఏడాది యూపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు […]

ఎరక్కపోయి ఇరుక్కుపోయిన కేంద్రం.. పెట్రోల్ రేట్లపై విమర్శల వర్షం..
X

దీపావళి పండగ సందర్భంగా పెట్రోలు రేట్లపై ఎక్సైజ్ సుంకం తగ్గించింది కేంద్రం. దీంతో లీటర్ పెట్రోలు రేటు 5 రూపాయలు, డీజిల్ రేటు 10 రూపాయల మేర తగ్గింది. అయితే ఏడాది కాలంలో లీటర్ పెట్రోల్ రేటు 28 రూపాయలు పెంచి, ఇప్పుడు కంటి తుడుపుగా 5 రూపాయలు తగ్గించడంపై తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కేవలం ఉప ఎన్నికల ఫలితాలు చూసి భయపడిన కేంద్రం రేట్లు తగ్గించిందని, వచ్చే ఏడాది యూపీ సహా ఇతర రాష్ట్రాల అసెంబ్లీలకు జరగబోయే ఎన్నికల్లో మరింత పెద్ద గుణపాఠం చెబితే పెట్రోలు రేట్లు ఇంకా తగ్గే అవకాశముందని సెటైర్లు వేస్తున్నాయి ప్రతిపక్షాలు. బీజేపీకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు శివసేన నేతలు.

రాష్ట్రాలపై ఒత్తిడి..
కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, రాష్ట్రాలు కూడా ఆ మేర వ్యాట్ ని తగ్గిస్తే ప్రజలకు మరింత లాభం చేకూరుతుందని అంటున్నారు బీజేపీ నేతలు. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు సిద్ధమయ్యారు కూడా. పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు నోరు మూసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఇప్పుడు 5 రూపాయలు తగ్గించడంతో ఎగిరెగిరి పడుతున్నారని మండిపడ్డారు మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలనుకోవడం చీప్ ట్రిక్ గా ఆమె కొట్టిపారేశారు. ఉప ఎన్నికల్లో పరాభవం ఎదురవడం వల్లే కేంద్రం రేట్లు తగ్గించిందని, ఇలాంటి చవకబారు రాజకీయ జిమ్మిక్కులతో ప్రజాభిమానం పొందలేరని అన్నారామె.

బీజేపీ పాలిత రాష్ట్రాలకు షాక్..
కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడం, రాష్ట్రాలను వ్యాట్ తగ్గించాలని సూచించడంతో.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెంటనే దీన్ని అమలు చేయాల్సి వస్తోంది. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిపై ఇంకా నిర్ణయం జరగలేదు కానీ కర్నాటక వంటి రాష్ట్రాలు మాత్రం వెంటనే తమవంతు కూడా రేట్లు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాయి. ఆమేరకు నష్టాన్ని భరించాల్సి రావడం బీజేపీ పాలిత రాష్ట్రాలకు కాస్త ఇబ్బందిగా మారింది. మొత్తమ్మీద భారీగా పెరిగిపోతున్న ఇంధన ధరల్ని తగ్గించడం వల్ల సింపతీ రాకపోగా.. గుణపాఠం డోసు పెంచాలనే ప్రచారం ఊపందుకోవడంతో బీజేపీ ఇరుకునపడింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బెంగ పెట్టుకుంది.

First Published:  4 Nov 2021 9:31 PM GMT
Next Story