Telugu Global
Cinema & Entertainment

సిద్ధ కోసం నీలాంబరి వచ్చేసింది

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా నుంచి ‘నీలాంబ‌రి నీలాంబ‌రి…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెలోడీ బ్ర‌హ్మ మణిశర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో […]

సిద్ధ కోసం నీలాంబరి వచ్చేసింది
X

చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నిరంజ‌న్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు.

ఈరోజు ఈ సినిమా నుంచి ‘నీలాంబ‌రి నీలాంబ‌రి…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. మెలోడీ బ్ర‌హ్మ మణిశర్మ సంగీత సార‌థ్యం వ‌హించిన ఈ సినిమాలో ఇప్ప‌టికే లాహే సాంగ్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు మెలోడీ సాంగ్‌గా ‘నీలాంబ‌రి..’ సాంగ్‌ను విడుద‌ల చేశారు. రామ్‌చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే జంట‌పై సాగే పాట ఇది. సిద్ధ పాత్రధారి రామ్ చరణ్, నీలాంబరి (పూజాహెగ్డే) కోసం పాడే సాంగ్ ఇది.

ఈ లిరిక‌ల్ వీడియోలో సాంగ్‌కు సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్‌, పాట చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన మేకింగ్ వీడియో కూడా చూపించారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, ర‌మ్యా బెహ్ర పాడిన ఈ పాట‌ను అనంత శ్రీరాం రాశారు. పాట విడుద‌ల అనంత‌రం చిరంజీవి పాట‌పై స్పందించారు. ‘మెలోడీ బ్రహ్మ మణిశర్మ అని మరో మారు రుజువు చేస్తున్న నీలాంబరి’ అంటూ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

First Published:  5 Nov 2021 7:38 AM GMT
Next Story