Telugu Global
NEWS

ఘన విజయంతో ఈటల సంబరాలు.. లైట్ తీస్కోండన్న టీఆర్ఎస్ నేతలు..

హుజూరాబాద్ విజయంతో ఈటల వర్గం సంబరాల్లో మునిగిపోయింది. అటు బీజేపీ నేతలు కూడా అసెంబ్లీలో తమ కౌంట్ పెరిగినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఓటమిని తెలంగాణ ప్రజలంతా కోరుకున్నారని, డబ్బులు పంచినా, పథకాలతో మోసం చేయాలని చూసినా కేసీఆర్ పన్నాగాలేవీ ఫలించలేదని అన్నారు ఈటల. ఐదు అంశాలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. దళితబంధుని రాష్ట్రవ్యాప్తం చేయాలనే డిమాండ్ తో ప్రజా పోరాటం చేస్తానని అన్నారు ఈటల. మిగిలిన అన్ని కులాలకు కూడా దళిత బంధు […]

ఘన విజయంతో ఈటల సంబరాలు.. లైట్ తీస్కోండన్న టీఆర్ఎస్ నేతలు..
X

హుజూరాబాద్ విజయంతో ఈటల వర్గం సంబరాల్లో మునిగిపోయింది. అటు బీజేపీ నేతలు కూడా అసెంబ్లీలో తమ కౌంట్ పెరిగినందుకు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఓటమిని తెలంగాణ ప్రజలంతా కోరుకున్నారని, డబ్బులు పంచినా, పథకాలతో మోసం చేయాలని చూసినా కేసీఆర్ పన్నాగాలేవీ ఫలించలేదని అన్నారు ఈటల. ఐదు అంశాలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. దళితబంధుని రాష్ట్రవ్యాప్తం చేయాలనే డిమాండ్ తో ప్రజా పోరాటం చేస్తానని అన్నారు ఈటల. మిగిలిన అన్ని కులాలకు కూడా దళిత బంధు ప్రకటించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ హామీని నెరవేర్చాలా చూస్తామని, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లకోసం పోరాడతామన్నారు.

ప్రతి రౌండ్ లోనూ ఈటలదే ఆధిక్యం..
హుజురాబాద్ ఎన్నికల్లో మొత్తం 22 రౌండ్లు కౌంటింగ్ జరగ్గా.. మూడు రౌండ్లు మినహా మిగతా అన్నింటిలో ఈటల రాజేందర్ కే స్పష్టమైన మెజార్టీ వచ్చింది. మొత్తంగా 24,068 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై ఈటల విజయం సాధించారు. ఈటలకు 51.96 శాతం ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి 40.38 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్ కేవలం 1.46 శాతం ఓట్లు మాత్రమే సాధించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు ఇది ఏడో విజయం. రెండుసార్లు కమలాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల, హుజూరాబాద్ నుంచి వరుసగా గెలవడం ఇది ఐదోసారి.

హుజూరాబాద్ ఫలితంతో ఒరిగేదేమీ లేదు..
హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం లేదని, ఫలితంతో ఒరిగేదేమీ లేదన్నారు మంత్రి కేటీఆర్. 20 ఏళ్లలో టీఆర్ఎస్ ఎన్నో ఆటుపోట్లు చవిచూసిందని చెప్పారాయన. గెల్లు శ్రీనివాస్ పోరాటం స్ఫూర్తిదాయకం అని అన్నారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని సూచించారు.

బీజేపీ, కాంగ్రెస్ కలసిపోయాయి..
ప్రజా తీర్పును శిరసా వహిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారాయన. ఒక్క ఓటమితో టీఆర్ఎస్ కుంగిపోదని, ఓడినా గెలిచినా టీఆర్ఎస్ ప్రజల పక్షాన పనిచేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ కి ఓట్లేమీ తగ్గలేదని చెప్పారు హరీష్. నైతిక విజయం తమదేనని అన్నారు అభ్యర్థి గెల్లు శ్రీనివాస్. టీఆర్ఎస్ ఓటమికోసం రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని విమర్శించారు. 2023లో హుజూరాబాద్ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

First Published:  2 Nov 2021 8:43 PM GMT
Next Story