Telugu Global
National

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో.. కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..

కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ ఫొటో ఎందుకంటూ కేరళలోని కొట్టాయంకు చెందిన పీటర్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్టిఫికెట్ అనేది తన ప్రత్యేక గుర్తింపు పత్రం అని, దానిపై ప్రధాని ఫొటో ఎందుకని పిటిషనర్ ప్రశ్నించారు. మోదీ ఫొటో తొలగించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. నగరేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రధాని మోదీ ఫొటోని తొలగించడానికి ఆదేశాలిస్తే.. రేపు ఎవరైనా […]

వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై మోదీ ఫొటో.. కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు..
X

కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ ఫొటో ఎందుకంటూ కేరళలోని కొట్టాయంకు చెందిన పీటర్ అనే వ్యక్తి కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్టిఫికెట్ అనేది తన ప్రత్యేక గుర్తింపు పత్రం అని, దానిపై ప్రధాని ఫొటో ఎందుకని పిటిషనర్ ప్రశ్నించారు. మోదీ ఫొటో తొలగించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్. నగరేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ప్రధాని మోదీ ఫొటోని తొలగించడానికి ఆదేశాలిస్తే.. రేపు ఎవరైనా వచ్చి కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫొటో తొలగించాలని కోరవచ్చని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి ఆలోచనలు చాలా ప్రమాదకరం అని చెప్పారు న్యాయమూర్తి.

కొవిడ్ సర్టిఫికెట్ తనకు మాత్రమే సొంతమైన గుర్తింపు పత్రం అని పిటిషనర్ చెబుతున్నారని, రేపు ఎవరైనా వచ్చి.. తాను చెమటోడ్చి, రక్తం ధారపోసి సంపాదించిన డబ్బుపై గాంధీ బొమ్మ ఎందుకు అని వాదించే అవకాశం కూడా ఉందని చెప్పారు జస్టిస్ నగరేష్. అప్పుడేం చేయాలని పిటిషనర్ ని ప్రశ్నించారు. న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై పిటిషనర్ తరపు న్యాయవాది స్పందించారు. మహాత్మా గాంధీ ఫొటోను భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం కరెన్సీ నోట్లపై ముద్రించారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను చట్టబద్ధమైన నిబంధన లేకపోయినా కొవిడ్ సర్టిఫికెట్లపై ముద్రిస్తున్నారని చెప్పారు.

ఈ కేసు విచారణలో భాగంగా కేంద్రాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తి కోరారు. కేంద్రం గడువు కోరడంతో తదుపరి విచారణ ఈనెల 23కి వాయిదా వేశారు.

First Published:  3 Nov 2021 10:23 AM GMT
Next Story