Telugu Global
National

భారత్ లో ధనత్రయోదశి బడ్జెట్ రూ.7500కోట్లు..

భారత్ లో ధనత్రయోదశి సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ఇంత డిమాండ్ ఉంటుందని వ్యాపారులు కూడా ఊహించలేదు. గతేడాది ఎలాగూ బిజినెస్ లేదు, ఈ ఏడాదయినా పుంజుకుంటుందేమో అని ఆశించినవారంతా భారీ కొనుగోళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. కరోనా కంటే ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో.. అంతకు మించి ఈ ఏడాది బంగారు కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపించడం విశేషం. కాయిన్స్ వద్దు.. నగలే ముద్దు.. గతంలో ధనత్రయోదశి సందర్భంగా చాలామంది సెంటిమెంట్ గా […]

భారత్ లో ధనత్రయోదశి బడ్జెట్ రూ.7500కోట్లు..
X

భారత్ లో ధనత్రయోదశి సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కష్టకాలంలో ఇంత డిమాండ్ ఉంటుందని వ్యాపారులు కూడా ఊహించలేదు. గతేడాది ఎలాగూ బిజినెస్ లేదు, ఈ ఏడాదయినా పుంజుకుంటుందేమో అని ఆశించినవారంతా భారీ కొనుగోళ్లు చూసి ఆశ్చర్యపోతున్నారు. కరోనా కంటే ముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో.. అంతకు మించి ఈ ఏడాది బంగారు కొనుగోళ్లకు ప్రజలు ఆసక్తి చూపించడం విశేషం.

కాయిన్స్ వద్దు.. నగలే ముద్దు..
గతంలో ధనత్రయోదశి సందర్భంగా చాలామంది సెంటిమెంట్ గా బంగారు కాసులు కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడా ట్రెండ్ కంటిన్యూ అవుతూనే.. నగలవైపు మొగ్గుచూపుతున్నారు జనం. డిసెంబర్ నుంచి పెళ్లి మహూర్తాలు ఉండటం.. రాబోయే రోజులు ఎలా ఉంటాయోననే అనుమానంతో ధనత్రయోదశి సెంటిమెంట్ ని ఉపయోగించుకుని కొనుగోళ్లకు తెరతీశారు. ప్రతి ఏడాదీ ధనత్రయోదశికి బంగారు కాయిన్స్, నగల అమ్మకాల నిష్పత్తి 50ః50 గా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం 30శాతం మంది కాయిన్స్ కొనడానికి మొగ్గు చూపితే, 70శాతం మంది నగలపై ఆసక్తి చూపించారు.

బంగారం ధరలు ప్రస్తుతం నిలకడగా ఉండటం, భవిష్యత్ లో మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో ఈ ఏడాది ధనత్రయోదశి వ్యాపారులకు ముందుగానే దీపావళి వెలుగులనిచ్చింది. 2020లో ధనత్రయోదశిపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది ఆంక్షలు సడలించడంతో ప్రజలు బంగారం కొనుగోలుని ఓ పెట్టుబడి మార్గంగా ఎంచుకున్నారు. కరోనాకి ముందు కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని, దేశవ్యాప్తంగా మొత్తం 7500కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని అఖిల భారత వర్తక సమాఖ్య తెలిపింది. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో.. డిసెంబర్ నాటికి బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయని చెబుతున్నారు.

First Published:  2 Nov 2021 8:57 PM GMT
Next Story