Telugu Global
Cinema & Entertainment

తండ్రిని ఆకాశానికెత్తేసిన బన్నీ

అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రిని ఆకాశానికెత్తేయడానికి ఏమాత్రం మొహమాటపడడు అల్లు అర్జున్. కెరీర్ స్టార్టింగ్ లో మామయ్య చిరంజీవిని, చిన మామయ్య పవన్ కల్యాణ్ ను పొగుడుతూ కనిపించిన బన్నీ, ఇప్పుడు తాతయ్య అల్లు రామలింగయ్యను, తండ్రి అల్లు అరవింద్ ను మాత్రమే స్టేజ్ పై పొగుడుతున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీకి మరోసారి తన తండ్రిని పొగిడే ఛాన్స్ వచ్చింది. ఆహా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం దీనికి వేదికైంది. “ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ […]

తండ్రిని ఆకాశానికెత్తేసిన బన్నీ
X

అవకాశం దొరికినప్పుడల్లా తన తండ్రిని ఆకాశానికెత్తేయడానికి ఏమాత్రం మొహమాటపడడు అల్లు అర్జున్. కెరీర్ స్టార్టింగ్ లో మామయ్య చిరంజీవిని, చిన మామయ్య పవన్ కల్యాణ్ ను పొగుడుతూ కనిపించిన బన్నీ, ఇప్పుడు తాతయ్య అల్లు రామలింగయ్యను, తండ్రి అల్లు అరవింద్ ను మాత్రమే స్టేజ్ పై పొగుడుతున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీకి మరోసారి తన తండ్రిని పొగిడే ఛాన్స్ వచ్చింది. ఆహా సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం దీనికి వేదికైంది.

“ఆహా ఇంత త్వ‌ర‌గా.. ఇంత‌ స‌క్సెస్ అవుతుంద‌ని అస‌లు అనుకోలేదు. అందుకు కార‌ణం ప్ర‌పంచంలోని తెలుగు ప్రేక్ష‌కులే. అంద‌రికీ మా ధ‌న్య‌వాదాలు. ఒక నెంబ‌ర్ వ‌న్ తెలుగు ఓటీటీగా ఆహా ఉన్నందుకు నాకెంతో గ‌ర్వంగా ఉంది. దీని స‌క్సెస్‌కు కార‌ణమైన వ్య‌క్తులు గురించి మాట్లాడాలంటే ముందు మా నాన్న‌గారు అల్లు అర‌వింద్‌గారి గురించి మాట్లాడాలి. తెలుగు ప్రేక్ష‌కుల కోసం ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛానెల్ తీసుకు రావాల‌నే ఆలోచ‌న ఆయనదే. 70 ఏళ్లు వ‌య‌సు వ‌చ్చిన త‌ర్వాత కాస్త రిలాక్స్ అవుతూ, రిటైర్ అయ్యే స‌మ‌యంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేక‌ప్ చేసి పాతికేళ్ల లోపు పిల్ల‌ల‌తో హ్యాంగోవ‌ర్‌చేస్తూ వ‌చ్చిన మీరే ఆహాకు పెద్ద ఎన‌ర్జీ”

బన్నీ తన తండ్రిని పొగిడాడనే విషయాన్ని పక్కనపెడితే, అందులో నిజం ఉంది. ఈ వయసులో కూడా అటు సినిమాలు నిర్మిస్తూ, ఇటు ఆహా వ్యవహారాలు చూసుకుంటూ, మరోవైపు స్టుడియో పనులు, డిస్ట్రిబ్యూషన్ పనులు చూసుకుంటూ బిజీగా ఉన్నారు అరవింద్. బహుశా ఆయన అంత ఉత్సాహంగా, యంగ్ గా ఉండడానికి కారణం చేసే పనిని ఎంజాయ్ చేయడమే.

First Published:  3 Nov 2021 9:10 AM GMT
Next Story