Telugu Global
National

అఖిలేశ్ ది తాలిబన్ల మనస్తత్వం.. యోగి ఫైర్..!

జాతిపిత మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పాకిస్తాన్ పితామహుడు మహ్మద్ అలీ జిన్నాను పోలుస్తూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం సృష్టిస్తున్నాయి. జిన్నా భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేష్ పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తాలిబన్ల మనస్తత్వాన్ని తెలియజేస్తోందని మండిపడింది. నిన్న హ‌ర్దోయిలో జ‌రిగిన స‌భ‌లో అఖిలేశ్ మాట్లాడుతూ.. స‌ర్దార్ పటేల్, […]

అఖిలేశ్ ది తాలిబన్ల మనస్తత్వం.. యోగి ఫైర్..!
X

జాతిపిత మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పాకిస్తాన్ పితామహుడు మహ్మద్ అలీ జిన్నాను పోలుస్తూ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం సృష్టిస్తున్నాయి. జిన్నా భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా అఖిలేష్ పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ తో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తాలిబన్ల మనస్తత్వాన్ని తెలియజేస్తోందని మండిపడింది.

నిన్న హ‌ర్దోయిలో జ‌రిగిన స‌భ‌లో అఖిలేశ్ మాట్లాడుతూ.. స‌ర్దార్ పటేల్, మ‌హాత్మా గాంధీ, జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ, జిన్నా ఒకే ఇన్ స్టిట్యూట్ నుంచి వ‌చ్చారని, వారంతా ఒకే సంస్థలో చదువుకుని బారిష్టర్లయ్యారని, దేశానికి స్వాతంత్రం తేవడంలో కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అలాగే వారు పోరాటం నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.. అని వ్యాఖ్యానించారు.

కాగా.. దేశం ఐక్యంగా ఉండటానికి ప్రయత్నించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ను, దేశ విభజనను కోరుకున్న జిన్నాను అఖిలేష్ ఒకే గాటన కట్టడంపై విమర్శలు వస్తున్నాయి. అఖిలేష్ వ్యాఖ్యలపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. అఖిలేశ్ వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు.

ఉత్తరప్రదేశ్, భారత దేశ ప్రజలు విభజన మనస్తత్వాన్ని ఎన్నటికీ అంగీకరించరన్నారు. విభజించడమనేది తాలిబన్ల మెంటాలిటీ అని, జిన్నా అలాంటివారేనని.. కానీ సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారని యోగి పేర్కొన్నారు. జిన్నాను భారత స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా కీర్తిస్తూ వ్యాఖ్యలు చేసిన అఖిలేష్ యాదవ్ క్షమాపణలు చెప్పాలని యోగి డిమాండ్ చేశారు.

First Published:  1 Nov 2021 8:46 AM GMT
Next Story