Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండకు స్ఫూర్తి ఇతడే

భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పాత్రలు, కథల ఎంపికలో విజయ్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. మరి ఈ హీరోకు స్ఫూర్తి ఎవరు? ఎవ్వర్ని చూసి ఎక్కువగా ఈ నటుడు స్ఫూర్తి పొందుతాడు? దీనికి విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు. హీరో అల్లు అర్జున్ ను చూసి విజయ్ దేవరకొండ ఎక్కువగా స్ఫూర్తి పొందుతుంటాడట. “చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులకు ఫిదా అయ్యాను. […]

విజయ్ దేవరకొండకు స్ఫూర్తి ఇతడే
X

భారీ సినిమాలతో దూసుకుపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. పాత్రలు, కథల ఎంపికలో విజయ్ చాలా
జాగ్రత్తగా ఉంటాడు. మరి ఈ హీరోకు స్ఫూర్తి ఎవరు? ఎవ్వర్ని చూసి ఎక్కువగా ఈ నటుడు స్ఫూర్తి
పొందుతాడు? దీనికి విజయ్ దేవరకొండ సమాధానం ఇచ్చాడు. హీరో అల్లు అర్జున్ ను చూసి విజయ్
దేవరకొండ ఎక్కువగా స్ఫూర్తి పొందుతుంటాడట.

“చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులకు ఫిదా అయ్యాను. ఆర్య సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పర్మార్మెన్స్, డాన్సులు చూసి అద్భుతంగా చేశాడు అనిపించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారంటే బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి వల్ల మేము మరింత దగ్గరయ్యాం. అల్లు అర్జున్ అన్న వర్క్ చూసి ప్రతి రోజూ ఇన్ స్పైర్ అవుతుంటా. పుష్ప సినిమాకు మీరు పడిన కష్టం చూస్తుంటే మనం కూడా ఇలా కష్టపడాలి అని అనిపిస్తుంటుంది. మాకు ఎప్పుడూ ఇన్సిపిరేషన్ గా మీరు ఉండటం సంతోషంగా ఉంది.”

పుష్ప సినిమాలోని ఓ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన ”చెప్పు స్టెప్” చూసి షాక్ అయ్యానన్నాడు విజయ్
దేవరకొండ. పాత్ర కోసం బన్నీ తననుతాను మార్చుకునే విధానం చూస్తే ముచ్చటేస్తుందన్నాడు.

First Published:  31 Oct 2021 7:47 AM GMT
Next Story