Telugu Global
International

పెళ్లి వేడుకలో సంగీతం వినిపించింది.. తాలిబన్లు కాల్చి చంపారు..

ఆఫ్ఘనిస్తాన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఈసారి తమ పంథా మారిందని, జనరంజకంగా పాలిస్తామని చెబుతూ వచ్చారు. అయితే బాలికల విద్య, మహిళా ఉద్యోగాల విషయంలో తాలిబన్ల విధానం ఏంటో.. ఇప్పటికే స్పష్టమైంది. ఆడవారిపై ఆంక్షలు పెరిగిపోయాయి. తాజాగా.. తాలిబన్లు మరో దురాగతానికి ఒడిగట్టారు. పెళ్లి వేడుకలో సంగీతం వినిపించిందనే నెపంతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరికొంతమందికి గాయాలయ్యాయి. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. సంబరంగా […]

పెళ్లి వేడుకలో సంగీతం వినిపించింది.. తాలిబన్లు కాల్చి చంపారు..
X

ఆఫ్ఘనిస్తాన్ ను తిరిగి స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. ఈసారి తమ పంథా మారిందని, జనరంజకంగా పాలిస్తామని చెబుతూ వచ్చారు. అయితే బాలికల విద్య, మహిళా ఉద్యోగాల విషయంలో తాలిబన్ల విధానం ఏంటో.. ఇప్పటికే స్పష్టమైంది. ఆడవారిపై ఆంక్షలు పెరిగిపోయాయి. తాజాగా.. తాలిబన్లు మరో దురాగతానికి ఒడిగట్టారు. పెళ్లి వేడుకలో సంగీతం వినిపించిందనే నెపంతో బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరికొంతమందికి గాయాలయ్యాయి. సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. సంబరంగా సాగాల్సిన పెళ్లి సంగీతం.. విషాద గీతంగా మారింది.

సంగీతంపై ఆంక్షలు..
గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలన సాగినప్పుడు సంగీతంపై నిషేధం ఉండేది. కానీ ఈ దఫా.. అలాంటి ప్రకటనలేవీ తాలిబన్లనుంచి రాలేదు. అధికారికంగా సంగీతంపై నిషేధం విధిస్తున్నట్టు తాలిబన్ల ప్రతినిధులు కూడా ఆదేశాలివ్వలేదు. దీంతో చాలామంది పాత పద్ధతిలోనే పెళ్లి వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో నంగరార్ ప్రావిన్స్ లోని సోర్ ఖుర్ద్ ప్రాంతంలో ఓ పెళ్లివేడుకపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు తాలిబన్లు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులు సంగీతం వింటూ సంతోషంగా ఉన్న సమయంలో దారుణానికి ఒడిగట్టారు.

అధికారం చేపట్టిన కొన్నిరోజుల వరకు తాలిబన్లు కాస్త తగ్గే ఉన్నారు. అయితే వారి అరాచకాలు ఒక్కొక్కటే ఇప్పుడు బయటపడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళా వాలీబాల్ ప్లేయర్ తలను తాలిబన్లు తెగనరికిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ క్రమంలో 100మంది మహిళా ఫుట్ బాల్ ప్లేయర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఖతర్ వచ్చేశారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో సంగీతంపై కూడా అనధికారిక నిషేధం కొనసాగుతోందని అర్థమైంది. క్రీడలు, సంగీతం వంటి వినోదాలకు తాలిబన్ పాలనలో చోటు లేదు. అందులోనూ ఆడవారు అలాంటి వినోదాల్లో పాల్గొంటే అది మరీ నేరం అంటారు. అందుకే పెళ్లి వేడుకలో చావు బాజా మోగించారు.

First Published:  31 Oct 2021 12:19 AM GMT
Next Story