Telugu Global
Others

పండక్కి ఆన్ లైన్ లో గిఫ్ట్ లు ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి..

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వినియోగదారులు అవగాహన పెంచుకుంటున్నా.. అంతకు మించిన వ్యూహాలతో అమాయకులను బుట్టలో పడేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. అందులోనూ పండగ సీజన్ అంటే ఇలాంటి మోసగాళ్లకు పండగే అంటున్నారు సైబర్ నిపుణులు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల వేళ.. ఆన్లైన్ మోసాలు మూడింతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీపావళికి ఆన్ లైన్ లో గిఫ్ట్ లు ఆర్డర్ చేసేముందు వెబ్ సైట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పండగ వేళ […]

పండక్కి ఆన్ లైన్ లో గిఫ్ట్ లు ఆర్డర్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి..
X

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. వినియోగదారులు అవగాహన పెంచుకుంటున్నా.. అంతకు మించిన వ్యూహాలతో అమాయకులను బుట్టలో పడేసుకుంటున్నారు సైబర్ మోసగాళ్లు. అందులోనూ పండగ సీజన్ అంటే ఇలాంటి మోసగాళ్లకు పండగే అంటున్నారు సైబర్ నిపుణులు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే పండగల వేళ.. ఆన్లైన్ మోసాలు మూడింతలు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. దీపావళికి ఆన్ లైన్ లో గిఫ్ట్ లు ఆర్డర్ చేసేముందు వెబ్ సైట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

పండగ వేళ ఆన్ లైన్ లో గిఫ్ట్ ప్యాక్ ఆర్డర్ చేసి.. అయినవాళ్లకి సర్ ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు చాలామంది. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి బహుమతి పంపించి పండగ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటారు. దీపావళి సందర్భంగా ఇలాంటి సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు వెబ్ సైట్ లు రెడీగా ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు మోసపూరిత సైట్లు ఉన్నాయని అంటున్నారు సైబర్ నిపుణులు. దీపావళి అనే పేరుని డొమైన్ గా ఉంచుకుని నెలరోజుల వ్యవధిలో కుప్పలు తెప్పలుగా వెబ్ సైట్లు పుట్టుకొచ్చాయి. గతేడాదికంటే ఈ ఏడాది ఇవి 200 శాతం అధికం. వీటిలో 3శాతం ఫేక్ అని ఈపాటికే తేలిపోయింది. మరో 31శాతం అనుమానాస్పదంగా ఉన్నాయని తేలింది. ఈ వెబ్ సైట్లలో చాలా వరకు పండగ తర్వాత కనిపించవు. కేవలం పండగ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని తెరపైకి వచ్చేవే.

పండగ సందర్భంగా ఎవరికైనా గిఫ్ట్ లు పంపించాలంటే ముందుగా ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తాం. పేరున్న ఆన్ లైన్ బిజినెస్ వెబ్ సైట్లు మనం కోరుకున్న ప్రాంతానికి, కోరుకున్న టైమ్ కి గిఫ్ట్ డెలివరీ చేసే అవకాశం లేకపోతే.. ఏదో ఒక వెబ్ సైట్ ని క్లిక్ చేయాల్సి వస్తుంది. అలా చేసే చివరికి చాలామంది మోసపోతున్నారని తేలింది. ఇలాంటి ఫేక్ వెబ్ సైట్లలో గిఫ్ట్ లు ఆర్డర్ చేస్తే.. సగానికి సగం అసలు డెలివరీయే కావు. పోనీ గిఫ్ట్ బాక్స్ వచ్చినా వాటిలో నాణ్యమైన వస్తువులు ఉంటాయనే గ్యారెంటీ లేదు. అందుకే పండగ పూట ఇలాంటి సర్ ప్రైజ్ లకు ప్లాన్ చేసుకోవద్దని చెబుతున్నారు సైబర్ నిపుణులు. ఫేక్ వెబ్ సైట్ల బారిన పడొద్దని హెచ్చరిస్తున్నారు.

First Published:  30 Oct 2021 11:58 PM GMT
Next Story