Telugu Global
Cinema & Entertainment

పుష్పక విమానం ట్రయిలర్ రివ్యూ

సినిమాలో హీరోకు కొత్తగా పెళ్లవుతుంది అయితే ఆ వెంటనే అది పెటాకులు కూడా అవుతుంది. భార్య లేచిపోతుంది. ఇదంతా ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ముచ్చట. పుష్పకవిమానం అనే సినిమా చేశాడు ఆనంద్. అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది. ట్రయిలర్ లో ఎమోషన్, కామెడీ మిక్స్ చేసి కొట్టారు. సినిమాలో హీరో ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించాడు. అతడికి కొత్తగా పెళ్లి అవుతుంది. కానీ భార్య లేచిపోతుంది. ఆ […]

పుష్పక విమానం ట్రయిలర్ రివ్యూ
X

సినిమాలో హీరోకు కొత్తగా పెళ్లవుతుంది అయితే ఆ వెంటనే అది పెటాకులు కూడా అవుతుంది. భార్య లేచిపోతుంది. ఇదంతా ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా ముచ్చట. పుష్పకవిమానం అనే సినిమా చేశాడు ఆనంద్. అల్లు అర్జున్ చేతుల మీదుగా ఆ సినిమా ట్రయిలర్ కొద్దిసేపటి కిందట విడుదలైంది.

ట్రయిలర్ లో ఎమోషన్, కామెడీ మిక్స్ చేసి కొట్టారు. సినిమాలో హీరో ప్రభుత్వ ఉపాధ్యాయుడి పాత్రలో కనిపించాడు. అతడికి కొత్తగా పెళ్లి అవుతుంది. కానీ భార్య లేచిపోతుంది. ఆ విషయాన్ని హీరో ఎవ్వరికీ చెప్పడు. పైగా తన భార్య ఇంట్లోనే ఉన్నట్టు అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్తుంది. ఇంతకీ హీరో భార్య నిజంగానే లేచిపోయిందా లేక హీరోనే ఏమైనా చేశాడా అనేది బ్యాలెన్స్ కథ.

ఇంత సీరియస్ స్టోరీని ఫన్నీగా చెప్పడమే ట్రయిలర్ లో హైలెట్ పాయింట్. అక్కడక్కడ కాస్త ఎమోషన్ టచ్ ఉన్నప్పటికీ అందులో కూడా ఫన్ దాగుందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది. ట్రయిలర్ లో ఆనంద్ లుక్, యాక్టింగ్ బాగున్నాయి. సునీల్ మరోసారి సీరియస్ కమ్ కామెడీ పాత్రలో మెప్పించాడు. నవంబర్ రెండో వారంలో థియేటర్లలోకి రాబోతోంది పుష్పక విమానం.

First Published:  30 Oct 2021 8:55 AM GMT
Next Story