Telugu Global
National

టపాకాయలు కాల్చే సమయాలివే.. బెంగాల్ సంచలన నిర్ణయం..

దీపావళి దగ్గరకొస్తోంది. అయితే గతంలోలాగా ఈసారి టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రం జోరందుకోలేదు. 5 రాష్ట్రాలు టపాకాయలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడంతో తమిళనాడులోని శివకాశి మార్కెట్ కళ తప్పింది. టపాకాయల తయారీ, వ్యాపారంపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికులు ఇబ్బందులపాలవుతారని, నిషేధం తొలగించాలంటూ ఆమధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసినా ఫలితం లేదు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తాజాగా టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గ్రీన్ క్రాకర్స్ మినహా మిగతా […]

టపాకాయలు కాల్చే సమయాలివే.. బెంగాల్ సంచలన నిర్ణయం..
X

దీపావళి దగ్గరకొస్తోంది. అయితే గతంలోలాగా ఈసారి టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లు మాత్రం జోరందుకోలేదు. 5 రాష్ట్రాలు టపాకాయలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించడంతో తమిళనాడులోని శివకాశి మార్కెట్ కళ తప్పింది. టపాకాయల తయారీ, వ్యాపారంపై ఆధారపడిన లక్షలాదిమంది కార్మికులు ఇబ్బందులపాలవుతారని, నిషేధం తొలగించాలంటూ ఆమధ్య తమిళనాడు సీఎం స్టాలిన్ ఆయా రాష్ట్రాలకు లేఖలు రాసినా ఫలితం లేదు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తాజాగా టపాకాయల అమ్మకాలు, కొనుగోళ్లపై పూర్తి స్థాయిలో నిషేధం విధించింది. గ్రీన్ క్రాకర్స్ మినహా మిగతా టపాకాయలు అమ్మడం, కొనుగోలు చేయడం, నిల్వ చేయడం పశ్చిమబెంగాల్ లో నేరం.

గ్రీన్ క్రాకర్స్ కి ఓకే.. అయితే..?
గ్రీన్ క్రాకర్స్ కి మాత్రం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే వాటి ధర బాగా ఎక్కువగా ఉండటంతో స్థానిక వ్యాపారులు వెనక్కి తగ్గుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి గ్రీన్ క్రాకర్స్ తెచ్చినా వాటికి పెద్దగా డిమాండ్ లేదని ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రుజువైంది. దీంతో వ్యాపారులు గ్రీన్ క్రాకర్స్ జోలికి వెళ్లడంలేదు. మరోవైపు అలాంటి క్రాకర్స్ కొనుగోలు చేసినా.. వాటిని కాల్చే విషయంలో బెంగాల్ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు మరింత విచిత్రంగా తోస్తున్నాయి. ఛాత్ పూజ సందర్భంగా ఉదయం 6నుంచి 8 వరకు కేవలం రెండు గంటలు మాత్రమే వాటిని కాల్చేందుకు అనుమతి ఉంది. ఇక దీపావళి రోజున సాయంత్రం 8నుంచి 10వరకు కేవలం 2గంటలు మాత్రమే అనుమతి ఉంది. క్రిస్టమస్ రోజున కేవలం 35నిముషాలు, కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే సందర్భంలో డిసెంబర్ 31 రాత్రి 11 గంటల 55 నిముషాలనుంచి 12.30 వరకు మాత్రమే.. అంటే 35 నిముషాలు మాత్రమే క్రాకర్స్ కాల్చేందుకు అనుమతిస్తూ బెంగాల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఉత్తర్వులు జారీ చేసింది.

కలకలం రేపుతున్న బెంగాల్ నిర్ణయం..
ఓవైపు ఢిల్లీ సహా మొత్తం 5 రాష్ట్రాలు దీపావళి రోజున గ్రీన్ క్రాకర్స్ కి మాత్రమే అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు సీఎం స్టాలిన్ అభ్యర్థన తర్వాత పరిస్థితి మారుతుందేమోనని అనుకున్నారు వ్యాపారులు. కానీ పండగ దగ్గరపడుతున్నా ఎవరూ తమ నిర్ణయాలు మార్చుకోలేదు. కొత్తగా పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు టపాకాయలు కాల్చే సమయాలపై కూడా నిబంధనలు విధించడంతో ఈసారి పూర్తి స్థాయిలో దీపావళి సందడి తగ్గిపోతుందని అంటున్నారు. కరోనా దెబ్బకంటే.. ఇప్పుడు రాష్ట్రాల నిబంధనలే టపాకాయల మార్కెట్ కి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

First Published:  27 Oct 2021 9:52 PM GMT
Next Story