Telugu Global
National

వ్యాక్సిన్ కొనడానికి అప్పులివ్వండి.. భారత్ అభ్యర్థన..

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా, డబ్బులెక్కడినుంచి వస్తాయంటూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను బాదిపారేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ముందు అప్పులకోసం దరఖాస్తులు పెట్టుకుంటోంది. తాజాగా ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB), ఆసియన్ ఇన్ ఫ్రాస్టక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ (AIIB) ముందు భారత్ తన అభ్యర్థనలను ఉంచింది. 66.7 కోట్ల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం కావాలంటూ అభ్యర్థించింది. లోన్ ఖరారైనట్టేనా..? ఇప్పటికే ఏఐబీ, […]

వ్యాక్సిన్ కొనడానికి అప్పులివ్వండి.. భారత్ అభ్యర్థన..
X

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా, డబ్బులెక్కడినుంచి వస్తాయంటూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లను బాదిపారేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల ముందు అప్పులకోసం దరఖాస్తులు పెట్టుకుంటోంది. తాజాగా ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB), ఆసియన్ ఇన్ ఫ్రాస్టక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ (AIIB) ముందు భారత్ తన అభ్యర్థనలను ఉంచింది. 66.7 కోట్ల వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయడానికి ఆర్థిక సాయం కావాలంటూ అభ్యర్థించింది.

లోన్ ఖరారైనట్టేనా..?
ఇప్పటికే ఏఐబీ, ఏఐఐబీ సంస్థలు భారత్ కు భారీగా లోన్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సిన్ పేరుతో మరింత లోన్ కోసం కేంద్రం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ (ADB) 11వేల 262 కోట్ల రూపాయలు రుణం మంజూరు చేసేందుకు మొగ్గు చూపినట్టు సమాచారం. ఇక ఆసియన్ ఇన్ ఫ్రాస్టక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంక్ (AIIB) 3752 కోట్ల రూపాయలు భారత్ కు వ్యాక్సిన్ కొనుగోలుకోసం అప్పు ఇచ్చేందుకు సిద్ధపడింది. త్వరలో దీనికి సంబంధించిన లావాదేవీలు మొదలవుతాయి.

తన్నుమాలిన ధర్మం.. మొదలు చెడ్డ బేరం..
ఓవైపు భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజం మెప్పుకోసం ఇరుగు పొరుగు దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. వ్యాక్సిన్ మైత్రి పేరుతో ఇప్పటికే రెండు విడతల్లో 10కోట్ల టీకాలు దానం చేసింది. ఇప్పుడు వ్యాక్సిన్ కొనుక్కోడానికి రుణాలు ఇవ్వాలంటూ బ్యాంకుల వెంట పడుతోంది. దీనిపై సహజంగానే విపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఓవైపు భారత్ లో పెట్రోలియం ఉత్పత్తుల రేట్లు పెంచుతున్నామని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్న కేంద్రం.. మరోవైపు వ్యాక్సిన్ పేరు చెప్పి రుణాలకు ప్రయత్నించడం దారుణం అంటున్నారు ప్రతిపక్ష నేతలు. అప్పు చేసి వ్యాక్సిన్ కొనాల్సిన సందర్భం ఉంటే.. మరి వ్యాక్సిన్ మైత్రి పేరుతో దాన ధర్మాలేంటని నిలదీస్తున్నారు.

First Published:  27 Oct 2021 11:24 PM GMT
Next Story