పవన్ సరసన కొత్తమ్మాయి పరిచయం
పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి మరో హీరోయిన్ లాక్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం ఇప్పటికే పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ నటించనున్న మరో సినిమాకు కూడా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఈసారి సాక్షి వైద్య ఎంపికైంది. త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కల్యాణ్. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ […]

పవన్ కల్యాణ్ సినిమాలకు సంబంధించి మరో హీరోయిన్ లాక్ అయింది. భవదీయుడు భగత్ సింగ్ సినిమా కోసం ఇప్పటికే పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు పవన్ నటించనున్న మరో సినిమాకు కూడా హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. ఈసారి సాక్షి వైద్య ఎంపికైంది.
త్వరలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్ కల్యాణ్. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్యను తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా ఫేమస్. ఆ పాపులారిటీనే ఈమెకు ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా ఛాన్స్ వచ్చేలా చేసింది.
ప్రస్తుతానికైతే మేకర్స్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు సంబంధించి
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. సురేందర్ రెడ్డి, అఖిల్ తో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత పవన్ కల్యాణ్ తో మూవీ మొదలవుతుంది.