Telugu Global
Cinema & Entertainment

రొమాంటిక్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది కేతిక శర్మ. ట్రయిలర్, పోస్టర్లలో ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ కేతిక శర్మ ఎక్కడ్నుంచి వచ్చింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? దీనికి కేతికా స్వయంగా సమాధానం చెప్పింది. “నేను ఢిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. రొమాంటిక్ మూవీతో […]

రొమాంటిక్ హీరోయిన్ బ్యాక్ గ్రౌండ్ ఇదే!
X

రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమౌతోంది కేతిక శర్మ. ట్రయిలర్, పోస్టర్లలో ఆమె
లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ కేతిక శర్మ ఎక్కడ్నుంచి వచ్చింది? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? దీనికి కేతికా స్వయంగా సమాధానం చెప్పింది.

“నేను ఢిల్లీ నుండి వ‌చ్చాను. మాది డాక్ట‌ర్స్ ఫ్యామిలీ.. అయితే నేను మాత్రం ఒక‌ కొత్త ప్రపంచాన్ని
ఎంచుకున్నాను. నాకు ఈ రంగమంటే చాలా ఇష్టం. సినిమా ఫీల్డ్ రావాలని అనుకున్నాను. రొమాంటిక్
మూవీతో ఇలా డెబ్యూ అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.”

రొమాంటిక్ లో తనకు ఎలా అవకాశం వచ్చిందనే విషయాన్ని కూడా బయటపెట్టింది కేతిక. ఆ సినిమాలో తన పాత్ర తీరుతెన్నుల్ని కూడా వివరించింది.

“ఇన్ స్టాగ్రాంలో మిమ్మల్ని చూశాం.. మీరు ఒకసారి ఆడిషన్‌కి రండి అని పూరి కనెక్ట్స్ నుంచి కాల్ వచ్చింది. వచ్చాను.. ఆడిషన్ ఇచ్చాను.. అలా సినిమా మొదలైంది. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయాలని అనుకునే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా తనకు నచ్చినట్టుగా బతికే అమ్మాయి కారెక్టర్‌ను ఈ సినిమాలో పోషించాను. మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది.”

రొమాంటిక్ రిలీజైన నెల రోజుల గ్యాప్ లోనే మరోసారి సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతోంది కేతిక. ఆమె నటించిన
రెండో సినిమా లక్ష్య కూడా థియేటర్లలోకి వస్తోంది. శర్వానంద్ ఇందులో హీరో.

First Published:  27 Oct 2021 7:36 AM GMT
Next Story