Telugu Global
NEWS

డీజీపీని రీకాల్ చేయండి.. ఢిల్లీలో చంద్రబాబు 4 డిమాండ్లు..

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇతర నేతలతో కలసి ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచినట్టు తెలిపారాయన. తమ ఫిర్యాదులు స్వీకరించిన రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, సమాచారం తెప్పించుకుంటానని చెప్పారని అన్నారు. ఆర్టికల్ 356ని ఉపయోగించి.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు చంద్రబాబు. టీడీపీ ఆఫీస్ లపై జరిగిన దాడి ఘటనలపై […]

డీజీపీని రీకాల్ చేయండి.. ఢిల్లీలో చంద్రబాబు 4 డిమాండ్లు..
X

ఏపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇతర నేతలతో కలసి ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ముందు మొత్తం నాలుగు డిమాండ్లు ఉంచినట్టు తెలిపారాయన. తమ ఫిర్యాదులు స్వీకరించిన రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, సమాచారం తెప్పించుకుంటానని చెప్పారని అన్నారు.

ఆర్టికల్ 356ని ఉపయోగించి.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు చంద్రబాబు. టీడీపీ ఆఫీస్ లపై జరిగిన దాడి ఘటనలపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని కోరామన్నారు. ఏపీలో జరుగుతున్న గంజాయి, లిక్కర్ వ్యాపారలై నిఘా పెట్టాలని, వాటిని కంట్రోల్ చేయాలని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. ఏపీ డీజీపీని రీకాల్ చేయాలని కోరినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై డీజీపీ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారని మండిపడ్డారాయన. పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించారని చెప్పారు. ఏపీ డీజీపీని రీకాల్ చేయడంతోపాటు.. ఆయన చేసిన అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టి శిక్షించాలని కోరారు.

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందని అన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్‌ పట్టుకున్నా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయని ఆరోపించారు. ఎక్కడా లేని లిక్కర్‌ బ్రాండ్లు ఏపీలో ఉంటున్నాయని, మద్యపాన నిషేధం పేరుతో భారీగా రేట్లు పెంచారని చెప్పారు. ‘డ్రగ్స్‌ ఫ్రీ ఏపీ’ కోసం టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ నేతలను ఆర్థికంగా, శారీరకంగా హింసలు పెడుతున్నారని అన్నారు చంద్రబాబు. ప్రజా ప్రయోజనాల కోసం పోరాడుతుంటే కార్యాలయాలపై దాడి చేసి తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు.

First Published:  25 Oct 2021 4:37 AM GMT
Next Story