Telugu Global
NEWS

హుజూరాబాద్ కు భారీగా బలగాలు.. ఎన్నికల కమిషన్ కు కేసీఆర్ హెచ్చరిక..

కేంద్ర ఎన్నికల కమిషన్ హద్దమీరుతోందని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈసీ రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో దళితబంధు పథకం అమలు నిలిపివేయాలంటూ సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఆయన ప్లీనరీలో స్పందించారు. ఎన్నికల కోడ్‌ అమలు లోకి వచ్చిన తర్వాత దళిత బంధును ఆపారని కేసీఆర్ మండిపడ్డారు. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నానని ప్లీనరీ వేదికగా చెప్పారు కేసీఆర్. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులని, ఈసీ ఏం చేసినా […]

హుజూరాబాద్ కు భారీగా బలగాలు.. ఎన్నికల కమిషన్ కు కేసీఆర్ హెచ్చరిక..
X

కేంద్ర ఎన్నికల కమిషన్ హద్దమీరుతోందని ఆరోపించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈసీ రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తోందని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో దళితబంధు పథకం అమలు నిలిపివేయాలంటూ సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై ఆయన ప్లీనరీలో స్పందించారు. ఎన్నికల కోడ్‌ అమలు లోకి వచ్చిన తర్వాత దళిత బంధును ఆపారని కేసీఆర్ మండిపడ్డారు. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ప్ర‌య‌త్నాలు మానుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నానని ప్లీనరీ వేదికగా చెప్పారు కేసీఆర్. హుజూరాబాద్ ద‌ళితులు అదృష్ట‌వంతులని, ఈసీ ఏం చేసినా న‌వంబ‌ర్ 4 త‌ర్వాత ద‌ళిత‌బంధు అమ‌లు జ‌రిగి తీరుతుందని హామీ ఇచ్చారు. హుజూరాబాద్‌ లో సీఎం సభ నిర్వహించొద్దంటూ కొంతమంది కోర్టుకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు కేసీఆర్.

మరోవైపు తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా హుజూరాబాద్ కి కేంద్రం 20 కంపెనీల పారా మిలట్రీ బలగాలను పంపించింది. సాధారణ ఎన్నికలను మించి ఇక్కడ ఉప ఎన్నికలకు కేంద్రం బలగాలను పంపించడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా చరిత్రలో అసెంబ్లీ ఎన్నికకోసం ఇంత పెద్దమొత్తంలో పారా మిలిటరీ బలగాలు రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. జిల్లాలోని 13 నియోజకవర్గాలకు కలిపి గత సార్వత్రిక ఎన్నికలకోసం మొత్తం 17 కంపెనీల పారామిలిటరీ బలగాలు వచ్చాయి. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం ఏకంగా 20కంపెనీల బలగాలను ఈసీ పంపించడం విశేషం. ఇది ఒక రకంగా రికార్డేనంటున్నారు.

ఇక హుజూరాబాద్ లో ప్రచారం చివరి దశకు చేరుకుంది. మరో రెండ్రోజుల్లో ప్రచారం ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల ముఖ్యనేతలంతా హుజూరాబాద్ లోనే తిష్టవేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు నేతలంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటుండటంతో నియోజకవర్గంలో కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. పలుచోట్ల ఘర్షణలు కూడా మొదలయ్యాయి. ఇలాంటి వాటికి ముందుగానే బ్రేక్ వేయాలనే ఉద్దేశ్యంతోనే ఈసీ భారీసంఖ్యలో కేంద్ర బలగాలను హుజూరాబాద్ కు పంపించినట్టు తెలుస్తోంది.

First Published:  25 Oct 2021 4:45 AM GMT
Next Story