Telugu Global
Cinema & Entertainment

పెద్దన్న తెలుగులోకి కూడా వచ్చేశాడు

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్నాత్తె తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది. అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్ నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు పెద్ద‌న్న టీజ‌ర్‌ను విడుద‌ల‌ చేశారు. సీనియర్ హీరో వెంకటేష్ ఈ టీజర్ ను లాంఛ్ చేశారు. […]

పెద్దన్న తెలుగులోకి కూడా వచ్చేశాడు
X

సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ అన్నాత్తె తెలుగులో పెద్ద‌న్న పేరుతో రాబోతుంది.
అన్నాత్తై సినిమా తెలుగు రైట్స్‌ను టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏషియన్ ఇన్ ఫ్రా
ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నారాయణదాస్
నారంగ్, సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈరోజు పెద్ద‌న్న టీజ‌ర్‌ను
విడుద‌ల‌ చేశారు. సీనియర్ హీరో వెంకటేష్ ఈ టీజర్ ను లాంఛ్ చేశారు.

మాస్ ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ పెద్దన్న సినిమాలో పుష్కలంగా ఉన్నాయనే విషయం టీజర్ చూస్తే అర్థమౌతోంది. డైలాగ్స్, యాక్షన్స్ సీక్వెన్స్, రజినీ మార్క్ స్టైల్‌తో రాబోతోన్న ‘పెద్దన్న’ టీజర్ సినిమాపై అంచనాల‌ను మ‌రింత‌ పెంచింది. డి ఇమ్మాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందరినీ మెప్పించేలా ఉంది.

శివ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన నయనతార నటిస్తోంది. మీనా, కుష్బూ, కీర్తి సురేష్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పెద్ద‌న్న సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న అత్యధిక‌ థియేటర్స్‌ల‌లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు

First Published:  23 Oct 2021 7:10 AM GMT
Next Story