Telugu Global
Cinema & Entertainment

బిగ్ పంచ్ కు రెడీ అవుతున్న వరుణ్

వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం ఇప్పటికే బజ్ సృష్టిస్తోంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది గని. ఇటీవల రిలీజ్ చేసిన గని ఫస్ట్ పంచ్ కు వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషంగా ఉన్నారు. వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థికి శక్తివంతమైన పంచ్ ఇచ్చిన వీడియో ఇది. ఇక సినిమా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా టాకీ పూర్తయింది. ఒక పాట మినహా […]

బిగ్ పంచ్ కు రెడీ అవుతున్న వరుణ్
X

వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం ఇప్పటికే బజ్ సృష్టిస్తోంది. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రానుంది గని. ఇటీవల రిలీజ్ చేసిన గని ఫస్ట్ పంచ్ కు వచ్చిన రెస్పాన్స్ తో మేకర్స్ సంతోషంగా ఉన్నారు. వరుణ్ తేజ్ బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థికి శక్తివంతమైన పంచ్ ఇచ్చిన వీడియో ఇది.

ఇక సినిమా షూటింగ్ అప్ డేట్స్ విషయానికొస్తే.. ఈ సినిమా టాకీ పూర్తయింది. ఒక పాట మినహా టోటల్
షూటింగ్ పూర్తయింది. ఈ ఒక్క పాటను కూడా మరో 10 రోజుల్లో పూర్తిచేయబోతున్నారు.

స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న గని సినిమాతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాకు
రచయిత కూడా అతడే. ఈ చిత్రాన్ని సిద్దూ ముద్దా, అల్లు బాబీ కలిసి నిర్మిస్తున్నారు. ఫుల్ టైమ్ నిర్మాతలుగా వీళ్లకు కూడా ఇదే తొలి సినిమా.

ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ కంప్లీట్ గా మేకోవర్ అయ్యాడు. నిజమైన బాక్సర్ గా తయారయ్యాడు. సాయీ
మంజ్రేకర్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు.

First Published:  21 Oct 2021 6:50 AM GMT
Next Story