Telugu Global
National

బెస్ట్​ సీఎంగా ఛ‌త్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి.. కేసీఆర్ గ్రాఫ్ డౌన్

హుజూరాబాద్ ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ సీఎంలపై ఐఏఎన్ఎస్- సీ ఓటర్ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ స‌ర్వేలో కేసీఆర్ ఆఖరి స్థానంలో నిలిచారు. సీఎం కేసీఆర్‌పై ప్రజాగ్రహం అమాంతం పెరిగిందని, ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 30.30 శాతం మంది ఓట్లు వచ్చినట్లు ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ఈ సందర్భంగా సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులారిటీ బాగా పడిపోతోందని.. కేసీఆర్ కు […]

బెస్ట్​ సీఎంగా ఛ‌త్తీస్​గఢ్​ ముఖ్యమంత్రి.. కేసీఆర్ గ్రాఫ్ డౌన్
X

హుజూరాబాద్ ఎన్నికలు జరగనున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా అత్యుత్తమ సీఎంలపై ఐఏఎన్ఎస్- సీ ఓటర్ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ స‌ర్వేలో కేసీఆర్ ఆఖరి స్థానంలో నిలిచారు. సీఎం కేసీఆర్‌పై ప్రజాగ్రహం అమాంతం పెరిగిందని, ప్రజాగ్రహ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు 30.30 శాతం మంది ఓట్లు వచ్చినట్లు ఐఏఎన్ఎస్-సీ ఓటర్ సర్వే వెల్లడించింది.

ఈ సందర్భంగా సీఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పాపులారిటీ బాగా పడిపోతోందని.. కేసీఆర్ కు తగ్గుతున్న పాపులారిటీ.. తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి దోహదపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మొత్తం 115 అంశాల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వేను నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా ఛ‌త్తీస్​గఢ్ సీఎం భూపేశ్ భగేల్ నిలిచారు. 94 శాతం మంది ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తపరిచారు. కేవలం ఆరు శాతం మంది మాత్రమే భగేల్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.

సర్వేలో సెకండ్ బెస్ట్ సీఎంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ దామి నిలిచారు. భగేల్ తో పోలిస్తే అతి తక్కువగా ప్రజాగ్రహం ఉన్న సీఎంగా ప్రకాశ్ సింగ్ కు చోటు దక్కింది. ప్రజాగ్రహ జాబితాలో మూడో స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, నాలుగో స్థానంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగిపై 28.1 శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.

First Published:  19 Oct 2021 10:10 PM GMT
Next Story