Telugu Global
NEWS

సీఐపై దాడి చేశారంటూ నారా లోకేష్ పై కేసు నమోదు..

ఏపీలో పట్టాభి వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై కొందరు దాడి చేసిన క్రమంలో సీఐ నాయక్ బందోబస్తుకోసం అక్కడికి వచ్చారు. ఈ దశలో నాయక్ పై దాడి జరిగిందని, టీడీపీ నేతలే దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1 గా నారా లోకేష్ పేరు చేర్చారు. ఏ-2గా అశోక్ బాబు, ఏ-3గా ఆలపాటి […]

సీఐపై దాడి చేశారంటూ నారా లోకేష్ పై కేసు నమోదు..
X

ఏపీలో పట్టాభి వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై కొందరు దాడి చేసిన క్రమంలో సీఐ నాయక్ బందోబస్తుకోసం అక్కడికి వచ్చారు. ఈ దశలో నాయక్ పై దాడి జరిగిందని, టీడీపీ నేతలే దాడి చేశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హత్యాయత్నం సహా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1 గా నారా లోకేష్ పేరు చేర్చారు. ఏ-2గా అశోక్ బాబు, ఏ-3గా ఆలపాటి రాజా, ఏ-4గా తెనాలి శ్రావణ్‌, ఏ-5గా పోతినేని శ్రీనివాసరావు లను పేర్కొన్నారు.

నారా లోకేష్ పై కేసు నమోదు చేయడంతో ఏపీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. వాస్తవానికి ఈరోజు ఏపీ బంద్ కి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. అయితే ఎక్కడా టీడీపీ నేతలు రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ నేతల్ని గృహనిర్బంధంలో ఉంచారు. అయితే కొంతమంది ఆందోళనలకు సిద్ధమవడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

ఈ నేపథ్యంలో ఈరోజు కూడా వైసీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనికి కొనసాగింపుగా నారా లోకేష్ సహా టీడీపీ నేతలపై కేసులు నమోదు కావడంతో కలకలం రేగింది. నిన్న మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై జరిగిన దాడి సందర్భంలో, రక్షణ ఇవ్వడానికి వచ్చిన సీఐపై టీడీపీ నేతలు దాడి చేశారంటూ కేసు నమోదు చేశారు. నారా లోకేష్ ని ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ నేతలు మాత్రం దాడి ఘటనలో సీఐ కూడా పాల్గొన్నారని, మాస్క్ వేసుకుని వచ్చారని ఆరోపించడం కొసమెరుపు.

First Published:  20 Oct 2021 4:40 AM GMT
Next Story