Telugu Global
NEWS

డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలివ్వండి.. టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు

విశాఖలో జోరుగా డ్రగ్స్ దందా సాగుతోందని.. దాని వెనక వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి హస్తం ఉందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం అర్ధరాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గుంటూరులోని ఆనందబాబు ఇంటికి వెళ్లారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి తనకు నోటీసులు ఇస్తారా? […]

డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలివ్వండి.. టీడీపీ నేత నక్కా ఆనందబాబు ఇంటికి పోలీసులు
X

విశాఖలో జోరుగా డ్రగ్స్ దందా సాగుతోందని.. దాని వెనక వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి హస్తం ఉందంటూ టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం అర్ధరాత్రి విశాఖ జిల్లా నర్సీపట్నం సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గుంటూరులోని ఆనందబాబు ఇంటికి వెళ్లారు. డ్రగ్స్ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి తనకు నోటీసులు ఇస్తారా? అంటూ ఆనందబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ సందర్భంగా పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పై ఆధారాలు దొరుకుతాయనే ఉద్దేశ్యంతోనే తాము గుంటూరు వచ్చినట్టు చెప్పారు. అయితే నోటీసులు స్వీకరించేందుకు ఆనందబాబు నిరాకరించారన్నారు. దీంతో తాము మరోసారి వెళ్లి నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. ఆయన స్టేట్‌మెంట్‌ ఇవ్వకుంటే 91 సీఆర్ఫీఎఫ్‌ కింద నోటీసులు ఇస్తామని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. డీజీపీ కొత్త సంప్రదాయాలకు తెరతీశారని విమర్శించారు. ఇటీవల టీడీపీ నేతలు తరచూ డ్రగ్స్ విషయంలో ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ దందాలో అధికార పార్టీ నేతల హస్తం ఉందంటూ వాళ్లు ఆరోపిస్తున్నారు. కాగా
గుంటూరులోని నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.

డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం, ఎంపీ విజయసాయిరెడ్డిపై నక్కా ఆనంద బాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం రాత్రి పోలీసులు నోటిసులు ఇవ్వగా తీసుకొనేందుకు ఆనందబాబు నిరాకరించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పోలీసులు మరోసారి నక్కా ఆనందబాబు ఇంటికి వచ్చారు. అయితే అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు సైతం అక్కడికి రావడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. టీడీపీ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏజెన్సీలో గంజాయి దందా సాగుతోందని నక్కా ఆనందబాబు అంటే.. అక్కడ విచారణ చేపట్టకుండా.. ఆగమేఘాల మీద నోటీసులు ఇచ్చేందుకు గుంటూరు రావడం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ప్రశ్నించారు. అన్ని కేసుల్లోనూ పోలీసులు ఇంత త్వరిత గతిన స్పందిస్తే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లి, పాలేరు నుంచి వచ్చే ఆదేశాల మేరకు పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

First Published:  19 Oct 2021 5:41 AM GMT
Next Story