Telugu Global
National

వ్యాక్సినేషన్లో ఉత్తరాఖండ్ రికార్డ్.. 100శాతం టార్గెట్ కంప్లీట్..

కొవిడ్ టీకా పంపిణీలో ఉత్తరాఖండ్ రాష్ట్రం టార్గెట్ రీచ్ అయింది. ఆ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఫస్ట్ డోస్ టీకా పంపిణీ పూర్తయింది. వీరిలో దాదాపు 50శాతానికి పైగా రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలోని పలు పట్టణాలు, కొన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ టార్గెట్లు పూర్తయినా.. వయోజనులందరికీ టీకాలు ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులకెక్కింది. ఈమేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. […]

వ్యాక్సినేషన్లో ఉత్తరాఖండ్ రికార్డ్.. 100శాతం టార్గెట్ కంప్లీట్..
X

కొవిడ్ టీకా పంపిణీలో ఉత్తరాఖండ్ రాష్ట్రం టార్గెట్ రీచ్ అయింది. ఆ రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఫస్ట్ డోస్ టీకా పంపిణీ పూర్తయింది. వీరిలో దాదాపు 50శాతానికి పైగా రెండో డోసు కూడా తీసుకున్నారు. ఇప్పటి వరకూ దేశంలోని పలు పట్టణాలు, కొన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ టార్గెట్లు పూర్తయినా.. వయోజనులందరికీ టీకాలు ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్డులకెక్కింది. ఈమేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామి ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఉత్తరాఖండ్ లో 18ఏళ్లు పైబడిన వారి జనాభా 74లక్షలు పైగా ఉంది. వీరందరికీ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయింది. దాదాపు మూడు నెలల ముందుగానే తాము ఈ రికార్డ్ ఫీట్ సాధించామని చెబుతున్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. వాస్తవానికి ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా వయోజనులందరికీ తొలిడోసు పూర్తి చేయాలని భారత ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని తాము ముందుగానే చేరామని ప్రకటించింది ఉత్తరాఖండ్.

సగటున రోజుకి 40లక్షల వ్యాక్సినేషన్ డోసులు భారత్ లో పంపిణీ అవుతున్నాయి. ఇప్పటి వరకు 97,65,89,540 వ్యాక్సిన్ డోసులు(ఆదివారం నాటికి) భారత్ లో పంపిణీ అయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలో మొత్తం 3కోట్ల 40లక్షలకు పైగా జనాభాకు కొవిడ్ సోకగా.. వారిలో 4,52,124మంది చనిపోయారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేస్ ల రేటు 0.57గా ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తర ప్రదేశ్ అత్యథికంగా 11కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయగా.. మహారాష్ట్రలో 9కోట్లకు పైగా టీకాలు వేశారు. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 100 శాతం ఫస్ట్ డోస్ పంపిణీ పూర్తయింది.

First Published:  17 Oct 2021 8:28 PM GMT
Next Story