Telugu Global
NEWS

ఏపీలో పల్లె వెలుగులకు కొత్త సొబగులు..

ఏపీఎస్ఆర్టీసీ అనగానే ముందుగా గొర్తొచ్చేది పల్లె వెలుగు బస్సులే. ఎక్కువ సంఖ్యలో ఉండేవి కూడా ఆర్డినరీ సర్వీసులే. కానీ వీటి వల్ల వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. అందుకే ఎక్స్ ప్రెస్ లు, లగ్జరీ బస్సుల మెయింటెనెన్స్ పై పెట్టిన శ్రద్ధ, పల్లె వెలుగు బస్సులపై పెట్టరు. అయితే ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకి కూడా మంచిరోజులు వచ్చాయి. 3వేలకు పైగా ఉన్న పల్లె వెలుగు బస్సుల్లో 2వేల బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి, కొత్తగా […]

ఏపీలో పల్లె వెలుగులకు కొత్త సొబగులు..
X

ఏపీఎస్ఆర్టీసీ అనగానే ముందుగా గొర్తొచ్చేది పల్లె వెలుగు బస్సులే. ఎక్కువ సంఖ్యలో ఉండేవి కూడా ఆర్డినరీ సర్వీసులే. కానీ వీటి వల్ల వచ్చే ఆదాయం మాత్రం అంతంతమాత్రమే. అందుకే ఎక్స్ ప్రెస్ లు, లగ్జరీ బస్సుల మెయింటెనెన్స్ పై పెట్టిన శ్రద్ధ, పల్లె వెలుగు బస్సులపై పెట్టరు. అయితే ఇప్పుడు పల్లె వెలుగు బస్సులకి కూడా మంచిరోజులు వచ్చాయి. 3వేలకు పైగా ఉన్న పల్లె వెలుగు బస్సుల్లో 2వేల బస్సులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి, కొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అధికారులు.

ఇటీవల పల్లె వెలుగు బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఏపీలో జరుగుతున్నాయి. యాక్సిల్ విరిగిపోయి టైర్లు ఊడిపోయి రెండు బస్సులు ఒకే త‌ర‌హా ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో వీటి మెయింటెనెన్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. నష్టనివారణ చర్యల్లో భాగంగా పల్లె వెలుగు బస్సులకు కొత్త రూపు తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ ద్వారకా తిరుమలరావు కార్యాచరణ సిద్ధం చేశారు.

పార్సిల్ సర్వీస్ లతో లాభాలు..
కరోనా కష్టకాలంలో ఆర్టీసీని పార్సిల్ సర్వీసులు ఆదుకున్నాయి. ప్యాసింజర్ల ప్రయాణాలు పూర్తిగా తగ్గిపోవడం, ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో బస్సులు నడపడం, చాలామంది వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆర్టీసీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో పూర్తి స్థాయి కార్గో సర్వీస్ లను మొదలు పెట్టారు అధికారులు. ఇటీవల డోర్ డెలివరీ సదుపాయాలన్ని కూడా ప్రారంభించారు. దీంతో ప్యాసింజర్ బస్సుల నష్టాలను ఆర్టీసీ కొంతవరకు పూడ్చుకోగలుగుతోంది.

త్వరలో విద్యుత్ బస్సులు..
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంలో భాగంగా త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను ఏపీఎస్ఆర్టీసీ సమకూర్చుకోబోతోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లను తట్టుకుని ప్రజా రవాణా వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలంటే ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కటే పరిష్కారంలా కనిపిస్తోంది. ప్రయోగాత్మకంగా దీన్ని అమలులో పెట్టి, త్వరలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెస్తారు.

స్థిరాస్థుల ద్వారా ఆదాయ మార్గాలు..
ప్రస్తుతం ఏపీలో ఆర్టీసీకి 5వేల కోట్ల రూపాయలకు పైగా స్థిరాస్తులున్నాయి. వాటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కూడా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తమ్మీద ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకున్న తర్వాత సంస్థను లాభాలబాట పట్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి.

First Published:  18 Oct 2021 4:09 AM GMT
Next Story