Telugu Global
National

సోనియా తర్వాత రాహులే.. కానీ..!

సోనియా గాంధీ తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పీఠం రాహుల్ గాంధీదే ననే విషయం దాదాపుగా స్పష్టమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు రాహుల్ సూచన ప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. అయితే ఆయన పట్టాభిషేకం మాత్రం మరో ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. 2022 సెప్టెంబర్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, అప్పటి వరకు తానే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. 2021 నవంబర్ […]

సోనియా తర్వాత రాహులే.. కానీ..!
X

సోనియా గాంధీ తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పీఠం రాహుల్ గాంధీదే ననే విషయం దాదాపుగా స్పష్టమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈమేరకు రాహుల్ సూచన ప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. అయితే ఆయన పట్టాభిషేకం మాత్రం మరో ఏడాదిపాటు వాయిదా వేసుకున్నారు. 2022 సెప్టెంబర్ లో ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని, అప్పుడే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని, అప్పటి వరకు తానే పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తానని సోనియా గాంధీ స్పష్టం చేశారు.

2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, జులై 21 నుంచి 20 ఆగస్టు వరకు పీసీసీ అధ్యక్షుల నియామకం జరుగుతుందని, ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం నేతలు తెలియజేశారు. అయితే అప్పటికే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి.. ఆ తర్వాతే నింపాదిగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది.

బాధ్యతలంటే వెనకడుగు..
ఏఐసీసీ అధ్యక్ష పదవి గాంధీ వారసులకు మినహా ఇంకెవరికీ ఇచ్చే అవకాశం లేదని ఈపాటికే తేలిపోయింది. అయితే ప్రియాంక పేరు మధ్యలో వినిపించినా.. ఆమె తమ్ముడికి అడ్డు వచ్చేందుకు ససేమిరా అంటున్నారు, యూపీ ఎన్నికలపైనే ఆమె ఫోకస్ పెట్టారు. ఈ దశలో బాధ్యతల స్వీకరణకు రాహుల్ వెనకగుడేస్తూనే వస్తున్నారు. వచ్చే ఏడాది కీలక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఆ గెలుపోటముల ప్రభావం తనపై పడుతుందేమోనని రాహుల్ మరోసారి వెనకడుగేశారు. అందుకే ఆ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాతే తాను బాధ్యతలు స్వీకరిస్తానని చెబుతున్నారట. సభ్యత్వ నమోదు, ఎన్నికల ప్రక్రియలాంటివన్నీ.. కేవలం సాంప్రదాయ ప్రక్రియలే. అధ్యక్షుడి ఎంపిక అనేది సోనియా చేతిలోనే పెడుతూ ఎలాగూ నేతలంతా తీర్మానం చేస్తారు. ఆమె రాహుల్ పేరు ప్రకటిస్తారు. అయితే ఈ వ్యవహారానికి కూడా 2022 సెప్టెంబర్ లో మహూర్తం నిర్ణయించడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది.

First Published:  16 Oct 2021 10:48 PM GMT
Next Story