Telugu Global
National

కానిస్టేబుల్ నుంచి నేరుగా ఎస్సై ప్రమోషన్.. మహారాష్ట్ర సంచలన నిర్ణయం..

పోలీస్ శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. కానిస్టేబుల్ నుంచి నేరుగా ఎస్సైగా పదోన్నతి కల్పించే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరినవారు గరిష్టంగా ఏఎస్సైలుగా మాత్రమే రిటైర్ అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడీ నిబంధన మార్చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. దీని ద్వారా మొత్తం 45వేల మంది సిబ్బందికి ఉపయోగం కలుగుతుందని చెప్పారాయన. పోలీస్ నాయక్ పోస్ట్ లు రద్దు.. కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా […]

కానిస్టేబుల్ నుంచి నేరుగా ఎస్సై ప్రమోషన్.. మహారాష్ట్ర సంచలన నిర్ణయం..
X

పోలీస్ శాఖలో భారీ ఎత్తున సంస్కరణలు చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. కానిస్టేబుల్ నుంచి నేరుగా ఎస్సైగా పదోన్నతి కల్పించే నిబంధనను అమలులోకి తెచ్చింది. ఇప్పటివరకు పోలీస్ కానిస్టేబుల్ గా విధుల్లో చేరినవారు గరిష్టంగా ఏఎస్సైలుగా మాత్రమే రిటైర్ అయ్యేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడీ నిబంధన మార్చేశారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. దీని ద్వారా మొత్తం 45వేల మంది సిబ్బందికి ఉపయోగం కలుగుతుందని చెప్పారాయన.

పోలీస్ నాయక్ పోస్ట్ లు రద్దు..
కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా పదోన్నతి పొందే క్రమంలో పోలీస్ నాయక్ అనే పోస్ట్ లో కొన్నాళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పుడీ పోలీస్ నాయక్ అనే పోస్ట్ ని మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నేరుగా కానిస్టేబుళ్లు సబ్ ఇన్ స్పెక్టర్లుగా పదోన్నతి పొందేందుకు మార్గం సుగమం చేసింది.

భారీగా బలగాల పెంపు..
ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్ శాఖలో 37,861మంది కానిస్టేబుళ్లు పనిచేస్తుండగా.. త్వరలో ఆ పోస్ట్ ల సంఖ్యను 51,210కి పెంచబోతోంది మహా రాష్ట్ర ప్రభుత్వం. అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ల పోస్ట్ లను 15,270నుంచి 17,771కి పెంచబోతోంది. ప్రస్తుతం అమలులోకి వస్తున్న ప్రమోషన్ల నిబంధనలతో.. కరోనా కష్టకాలంలో తమ శ్రమకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇచ్చినట్లయిందని కానిస్టేబుళ్లు సంబరపడిపోతున్నారు. ఈ ప్రమోషన్లు, కొత్త సిబ్బంది నియామకంతో నేర విచారణ వేగవంతం అవుతుందని, ప్రతి స్టేషన్లో సిబ్బంది సంఖ్య పెరుగుతుందని చెబుతున్నారు అధికారులు.

First Published:  15 Oct 2021 11:40 PM GMT
Next Story