Telugu Global
Cinema & Entertainment

రవితేజ డబుల్ "ధమాకా"

సినిమా సినిమాకు మధ్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు రవితేజ. ఏమాత్రం టైమ్ దొరికినా మరో సినిమా ప్రకటించేస్తున్నాడు. ఇప్పటికే 2 సినిమాలు సెట్స్ పై ఉండగా, ఇప్పుడు మూడో సినిమాను కూడా స్టార్ట్ చేశాడు. దాని టైటిల్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఆ సినిమా పేరు ధమాకా. రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఈ ధమాకా అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఓ సాంగ్ పిక్చరైజ్ […]

రవితేజ డబుల్ ధమాకా
X

సినిమా సినిమాకు మధ్య అస్సలు గ్యాప్ ఇవ్వడం లేదు రవితేజ. ఏమాత్రం టైమ్ దొరికినా మరో సినిమా
ప్రకటించేస్తున్నాడు. ఇప్పటికే 2 సినిమాలు సెట్స్ పై ఉండగా, ఇప్పుడు మూడో సినిమాను కూడా స్టార్ట్
చేశాడు. దాని టైటిల్, మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఆ సినిమా పేరు ధమాకా.

రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ఈ ధమాకా అనే టైటిల్ పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. డబుల్ ఇంపాక్ట్ అనేది క్యాప్షన్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రవితేజ స్టైలిష్‌గా సిగరెట్ తాగుతూ ఉండటం, ఆయన మొహంలో ఏదో తెలియని కథను చెప్పేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది వరకు ఎన్నడూ కూడా చూడని రవితేజను చూడబోతోన్నట్టు తెలుస్తోంది. ఒకే లుక్ లో అటు క్లాస్, ఇటు మాస్ కనిపించేలా డిజైన్ చేశారు. డబుల్ ఇంపాక్ట్ అంటే అదేనేమో.

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా, వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా
వ్యవహరిస్తున్నారు. పెళ్లిసందD ఫేమ్ శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు.

First Published:  16 Oct 2021 8:06 AM GMT
Next Story