Telugu Global
National

జనాభా విధానం మారాలి  " మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు 

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా విధానం మారాల్సి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రోజు రోజుకూ హిందువుల జనాభా తగ్గిపోతోందని.. ఇతర మైనార్టీ కులాల జనాభా పెరుగుతోందని బీజేపీకి చెందిన కొందరు అతివాదులు వ్యాఖ్యానిస్తుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయంపై చర్చ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని రాష్ట్రీయ […]

జనాభా విధానం మారాలి   మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు 
X
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జనాభా విధానం మారాల్సి ఉందంటూ ఆయన వ్యాఖ్యానించారు. రోజు రోజుకూ హిందువుల జనాభా తగ్గిపోతోందని.. ఇతర మైనార్టీ కులాల జనాభా పెరుగుతోందని బీజేపీకి చెందిన కొందరు అతివాదులు వ్యాఖ్యానిస్తుంటారు. ఈ నేపథ్యంలో మహేశ్ భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేశారన్న విషయంపై చర్చ జరుగుతోంది.
దేశ వ్యాప్తంగా ఘనంగా దసరా ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయంలోనూ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి.ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఓటీటీల్లో విచ్చలవిడి తనం పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. టీనేజ్ పిల్లలంతా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని.. వారంతా ఓటీటీల్లో వచ్చే కంటెంట్ చూసి తప్పుదోవ పడుతున్నారని వ్యాఖ్యానించారు. భారతీయ సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు.
ఓటీటీ విషయంలో సెన్సార్ లాంటిది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చాలా రోజులుగా బీజేపీ నేతలు ఓటీటీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆర్ఎస్ ఎస్ చీఫ్ మహేశ్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
First Published:  15 Oct 2021 9:59 AM GMT
Next Story