భారత్ లో ఆకలి కేకలు.. అబ్బే అదేం లేదంటున్న కేంద్రం..
74ఏళ్ల స్వతంత్ర భారత్ లో ఇంకా ఆకలి కేకలు మాత్రం ఆగలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు కానీ, భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఆగిపోయింది. ఆకలి చావులను ఆపేందుకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశ పెడుతున్న కొత్త కొత్త పథకాల వల్ల ఉపయోగం లేదని మరోసారి రుజువైంది. అవును ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ లో భారత్ స్థానం 101కి చేరింది. గతేడాది భారత్ 94వ స్థానంలో ఉండగా.. ఈ సారి పరిస్థితి […]
BY sarvi15 Oct 2021 10:34 AM GMT
X
sarvi Updated On: 15 Oct 2021 10:34 AM GMT
74ఏళ్ల స్వతంత్ర భారత్ లో ఇంకా ఆకలి కేకలు మాత్రం ఆగలేదు. ప్రభుత్వాలు మారుతున్నా, ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు కానీ, భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఆగిపోయింది. ఆకలి చావులను ఆపేందుకు కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రవేశ పెడుతున్న కొత్త కొత్త పథకాల వల్ల ఉపయోగం లేదని మరోసారి రుజువైంది. అవును ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ లో భారత్ స్థానం 101కి చేరింది. గతేడాది భారత్ 94వ స్థానంలో ఉండగా.. ఈ సారి పరిస్థితి మరింత దిగజారింది. నిరుపేదల ఆకలి చావులు, దుర్భర జీవన పరిస్థితి ఉన్న 31 దేశాల లిస్ట్ లో భారత్ కూడా ఉండటం గమనార్హం.
పొరుగుదేశాలైన పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక.. కూడా మన దేశం కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో పేద, ధనిక మధ్య అంతరాలు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పడానికి ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ -2021 మరో ఉదాహరణ అని తేలింది. అయితే ఈ ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. అసలు ఏ ప్రాతిపదికన భారత్ కు 101వ ర్యాంక్ ఇచ్చారని కేంద్రం ప్రశ్నిస్తోంది. ఆ నివేదిక అంతా తప్పుల తడక అని సర్దిచెప్పుకుంటోంది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. తాజా నివేదికపై తీవ్రంగా స్పందించారు.
హంగర్ ఇండెక్స్ లో భారత్ తర్వాత న్యూగినియా, ఆఫ్ఘనిస్తాన్, కాంగో, హైతీ, మడగాస్కర్.. చివరిగా సోమాలియా ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత దుర్భర పరిస్థితులు, ఆకలి చావులు ఉన్న దేశంగా సోమాలియా తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది. అయితే భారత్ లో పైకి పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నా.. లోపల మాత్రం మేడిపండు చందంగా ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. కరోనా కష్టకాలంలో మన పొరుగు దేశాల్లో పరిస్థితులు దిగజారకపోయినా.. భారత్ లో మాత్రం నిరుపేదలు ఆకలితో అల్లాడిపోయారని ఈ నివేదిక వెల్లడించింది. కరోనా కాలంలో 80కోట్ల మందికి నెలల తరబడి కేంద్ర ప్రభుత్వం 5కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించింది. అయినా కూడా భారత్ లో పరిస్థితి చక్కబడలేదంటే ప్రభుత్వ పథకాలు ఎలా నీరుగారిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పథకాల ప్రచారంపై పెట్టిన దృష్టి, వాటి అమలు తీరుపై పెట్టలేదనే విమర్శలు వినపడుతున్నాయి.
Next Story