Telugu Global
National

శత్రువుకి శత్రువు.. అయినా శత్రువే.. బీజేపీ, టీఎంసీ పోరులో కాంగ్రెస్ సతమతం..

బీజేపీని అంతం చేస్తామ‌ని, మోదీని గద్దె దింపుతామంటూ పంతం పట్టిన తృణమూల్ కాంగ్రెస్.. ఇప్పుడు కాంగ్రెస్ కి పరోక్షంగా ప్రమాదకారిగా మారింది. మమతా బెనర్జీ ప్రాపకం కోసం ఇటీవల భవానీపూర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినా సరే కాంగ్రెస్ ని టీఎంసీ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. బీజేపీని ఓడించడం కాంగ్రెస్ ఒక్కదానితో కుదిరే పని కాదని, అది తృణమూల్ కే సాధ్యమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. […]

శత్రువుకి శత్రువు.. అయినా శత్రువే.. బీజేపీ, టీఎంసీ పోరులో కాంగ్రెస్ సతమతం..
X

బీజేపీని అంతం చేస్తామ‌ని, మోదీని గద్దె దింపుతామంటూ పంతం పట్టిన తృణమూల్ కాంగ్రెస్.. ఇప్పుడు కాంగ్రెస్ కి పరోక్షంగా ప్రమాదకారిగా మారింది. మమతా బెనర్జీ ప్రాపకం కోసం ఇటీవల భవానీపూర్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. అయినా సరే కాంగ్రెస్ ని టీఎంసీ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. బీజేపీని ఓడించడం కాంగ్రెస్ ఒక్కదానితో కుదిరే పని కాదని, అది తృణమూల్ కే సాధ్యమని అంటున్నారు ఆ పార్టీ నేతలు. దీంతో కాంగ్రెస్ లో కూడా కలవరం మొదలైంది. కాంగ్రెస్ ఫ్రీ ఇండియా అంటూ ప్రచారం చేస్తున్న బీజేపీ లాగే, కాంగ్రెస్ ఫ్రీ బెంగాల్ అంటూ తృణమూల్ వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి అంటున్నారు. ఈ విషయంలో బీజేపీకి, టీఎంసీకి పెద్ద తేడా లేదని చెప్పారు. కాంగ్రెస్ కి రాజకీయ సమాధి కట్టేందుకు మమత ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శత్రువుకి శత్రువు.. అయినా..
శత్రువుకి శత్రువు సహజంగా మిత్రుడు అవుతాడు. కానీ బీజేపీని ఉమ్మడి శత్రువుగా భావిస్తున్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్.. రెండూ ఇంకా శత్రువులుగానే ఉన్నాయి. టీఎంసీ అధికారిక పత్రిక ‘జాగో బంగ్లా’లో ఇటీవల కాంగ్రెస్ ని తక్కువ చేసేలా కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఢిల్లీ కాలింగ్ అనే పేరుతో వచ్చిన ఓ కథనంలో.. బీజేపీని ఓడించడం కాంగ్రెస్ కి సాధ్యం కాదని, అది తృణమూల్ తోనే సాధ్యమని చెప్పుకొచ్చారు. పరోక్షంగా కాంగ్రెస్ ని కూడా టీఎంసీ టార్గెట్ చేసింది. బెంగాల్ తోపాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన గోవాలో కాంగ్రెస్ నాయకులందర్నీ టీఎంసీ తమవైపు తిప్పుకుంటోంది.

పశ్చిమబెంగాల్ లో ఘన విజయం తర్వాత భవానీ పూర్ మలి విజయం మమతా బెనర్జీకి, ఆ పార్టీ నేతలకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఇకపై దేశ రాజకీయాలపై దృష్టిపెడతానంటున్న మమతా బెనర్జీ మొదట్లో కాంగ్రెస్ తో సఖ్యత కోరుకున్నారు. ఆ పార్టీ అధినేతలతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు టీఎంసీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనపడుతోంది. కాంగ్రెస్ నాయకత్వంలో విపక్షాలన్నీ ఏకం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో టీఎంసీ భాగస్వామి కావడంలేదు. బీజేపీకి ఏకైక ప్రత్యామ్నాయం టీఎంసీయేనని అంటున్నారు ఆ పార్టీ నేతలు. అదే విధంగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ని కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు.

First Published:  11 Oct 2021 4:33 AM GMT
Next Story