Telugu Global
Cinema & Entertainment

తనే కాదు, తన వర్గాన్ని కూడా గెలిపించుకున్నాడు

నాయకుడు అనేవాడు తను మాత్రమే గెలిస్తే సరిపోదు, తన వర్గాన్ని కూడా గెలిపించుకోవాలి. అప్పుడే విజయం పరిపూర్ణమౌతుంది. ఈ విషయంలో మంచు విష్ణు వ్యూహాలు బాగా పనిచేశాయి. కేవలం తన పదవి కోసం మాత్రమే కాకుండా.. ప్యానెల్ లోని ఇతర సభ్యుల పదవుల కోసం కూడా మంచు విష్ణు పన్నిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేసిన క్యాంపెయినింగ్ బాగా పనిచేసింది. అధ్యక్ష పదవితో పాటు కీలకమైన జనరల్ సెక్రటరీ, ట్రెజరల్ లాంటి పదవులతో పాటు.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల విషయంలో కూడా […]

తనే కాదు, తన వర్గాన్ని కూడా గెలిపించుకున్నాడు
X

నాయకుడు అనేవాడు తను మాత్రమే గెలిస్తే సరిపోదు, తన వర్గాన్ని కూడా గెలిపించుకోవాలి. అప్పుడే
విజయం పరిపూర్ణమౌతుంది. ఈ విషయంలో మంచు విష్ణు వ్యూహాలు బాగా పనిచేశాయి. కేవలం తన పదవి
కోసం మాత్రమే కాకుండా.. ప్యానెల్ లోని ఇతర సభ్యుల పదవుల కోసం కూడా మంచు విష్ణు పన్నిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేసిన క్యాంపెయినింగ్ బాగా పనిచేసింది.

అధ్యక్ష పదవితో పాటు కీలకమైన జనరల్ సెక్రటరీ, ట్రెజరల్ లాంటి పదవులతో పాటు.. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ల విషయంలో కూడా మంచు విష్ణు తన వాళ్లను గెలిపించుకోగలిగాడు. గత ఎన్నికల్లో నరేష్ గెలిచినా, తన వర్గానికి చెందిన ఎక్కువమంది సభ్యుల్ని గెలిపించుకోలేకపోయాడు. ఒక దశలో జీవిత ఇచ్చిన షాక్ తో నరేష్ ఒంటరివాడయ్యాడు. ఈసారిమాత్రం మంచు విష్ణుకు అలాంటి సమస్యలు ఉండబోవు. ఎందుకంటే, ప్యానెల్ పై దాదాపు పూర్తి ఆధిపత్యం మంచు విష్ణు వర్గానిదే.

అధ్యక్షుడిగా ప్రకాష్ రాజ్ పై గెలిచిన మంచు విష్ణు.. వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవిని తన ప్యానెల్ నుంచి గెలిపించుకున్నాడు. జనరల్ సెక్రటరీగా రఘుబాబును, ట్రెజరర్ గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజును కూడా గెలిపించుకున్నాడు. ఇలా కీలకమైన పదవుల్లో తనవాళ్లను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యాడు మంచు విష్ణు. కోర్ టీమ్ లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలిచిన శ్రీకాంత్ మాత్రమే ప్రకాష్ ప్యానెల్ వ్యక్తి. మిగతా వాళ్లంతా మంచు విష్ణు ప్యానెల్ సభ్యులే.

అటు ఈసీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ) మెంబర్లుగా కూడా చాలామంది మంచు విష్ణు ప్యానెల్ నుంచే గెలవడం
విశేషం. 18 మంది ఈసీ మెంబర్లకు గాను, 11 మంది మంచు విష్ణు ప్యానెల్ సభ్యులే గెలుపొందారు. దీంతో ఈసారి అసోసియేషన్ పై పూర్తి పట్టు సంపాదించాడు మంచు విష్ణు.

ఇకపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి ఏ పని చేయాలనుకున్నప్పటికీ బోర్డ్ నుంచి విష్ణుకు
ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. చకచకా నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. గతంలో నరేష్ కు
ఇలాంటి పరిస్థితి లేకపోవడంతో ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. కొత్త ప్యానెల్ ఎలా పనిచేస్తుందనేది
రాబోయే రోజుల్లో తేలబోతోంది. మరీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో ”మా” బిల్డింగ్ అంశం ఓ కొలిక్కి వస్తుందేమో
చూడాలి. ఎందుకంటే, స్వయంగా మంచు విష్ణు తన డబ్బుతో బిల్డింగ్ కట్టిస్తానని ప్రకటించాడు.

First Published:  10 Oct 2021 9:06 PM GMT
Next Story