Telugu Global
Cinema & Entertainment

స్కై ల్యాబ్ మూవీ ఎంత వరకు వచ్చింది

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై […]

స్కై ల్యాబ్ మూవీ ఎంత వరకు వచ్చింది
X

స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ
పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో
సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే థియేట్రికల్ ట్రయిలర్ విడుదల చేయబోతున్నారు.

అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి
నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి
బిగపట్టి ఎదురుచూడసాగారు. ప్రపంచంలోని అన్నీ న్యూస్‌ చానెల్స్‌, వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి.

అలాంటి నేపథ్యంలో తెలంగాణలో బండ లింగపల్లి అనే గ్రామంలో ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల
జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా
స్కైలాబ్ మూవీలో చూపించారు. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమాలో సత్యదేవ్, నిత్యామీనన్ గెటప్స్ కొత్తగా ఉండబోతున్నాయి.

First Published:  10 Oct 2021 7:21 AM GMT
Next Story