Telugu Global
National

2030 నాటికి విద్యుత్ వాహన భారత్..

విద్యుత్ వాహనాల రంగంలో భారత్ మరో 9 ఏళ్లలో కీలక స్థానానికి చేరుకుంటుందని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 2030నాటికి భారత్ లో అమ్ముడయ్యే కార్లలో 30శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో 70శాతం, టూవీలర్, త్రీ వీలర్స్ అమ్మకాల్లో 80శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోందని అన్నారు. ఆమేరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అమ్మకాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అలా చేస్తే […]

2030 నాటికి విద్యుత్ వాహన భారత్..
X

విద్యుత్ వాహనాల రంగంలో భారత్ మరో 9 ఏళ్లలో కీలక స్థానానికి చేరుకుంటుందని తెలిపారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 2030నాటికి భారత్ లో అమ్ముడయ్యే కార్లలో 30శాతం ఎలక్ట్రిక్ కార్లు ఉండేలా టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పారు. మొత్తం కమర్షియల్ వాహనాల అమ్మకాల్లో 70శాతం, టూవీలర్, త్రీ వీలర్స్ అమ్మకాల్లో 80శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా కేంద్రం చర్యలు చేపడుతోందని అన్నారు. ఆమేరకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అమ్మకాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

అలా చేస్తే 3.5లక్షల కోట్లు ఆదా..
టూ వీలర్లు, కార్ల సెగ్మెంట్ లో 40శాతం, బస్సుల్లో 100శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తే 2030నాటికి మొత్తం దేశవ్యాప్తంగా 3.5లక్షల కోట్ల రూపాయల మేర ఇంధనం ఆదా అవుతుందని చెప్పారు నితిన్ గడ్కరీ. ఇప్పటికే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు తమ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీలను ప్రకటించాయని, మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పాలసీల ప్రకటనకోసం నీతి ఆయోగ్ కృషి చేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల్లో వినియోగిస్తున్న లిథియం-అయాన్ కు భారత్ లో కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.

మేకిన్ ఇండియా.. సేల్ ఇన్ ఇండియా..
చైనాలో తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లను భారత దేశంలో అమ్మవద్దని, భారత దేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి అమ్మాలని టెస్లా కంపెనీకి ఇప్పటికే అనేకసార్లు చెప్పినట్టు తెలిపారు నితిన్ గడ్కరీ. భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతిపై సుంకాలను తగ్గించాలని టెస్లా డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో తయారు చేయాలని, అందుకు అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు. దేశంలో టాటా మోటార్స్ తయారు చేసే ఎలక్ట్రిక్ కార్లు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కన్నా తీసికట్టేమీ కాదని చెప్పారు.

First Published:  8 Oct 2021 11:21 PM GMT
Next Story