Telugu Global
National

కొవిడ్ బాధిత కుటుంబాలకు టీసీఎస్ ఉపాధి మార్గం..

కొవిడ్ కారణంగా కుటుంబ పెద్దల్ని కోల్పోయి, ఉపాధి లేక వీధిన పడ్డ కుటుంబాలు చాలానే ఉన్నాయి. కొవిడ్ వైద్యం కోసం ఇల్లు, ఆస్తులు అమ్ముకుని, చివరకు అయినవారినీ కోల్పోయి ఏమీ లేనివారిగా మిగిలినవారిని కూడా చూశాం. ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం కంటితుడుపు మాత్రమే. అయితే ఆయా కుటుంబాల ఆర్థిక కష్టాలు తీర్చేందుకు బాధిత కుటుంబ సభ్యులకు ఉపాధి చూపించేందుకు ముందుకొచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కొన్ని ప్రైవేటు సంస్థలు నేరుగా ఆర్థికసాయం అందిస్తున్నా.. […]

కొవిడ్ బాధిత కుటుంబాలకు టీసీఎస్ ఉపాధి మార్గం..
X

కొవిడ్ కారణంగా కుటుంబ పెద్దల్ని కోల్పోయి, ఉపాధి లేక వీధిన పడ్డ కుటుంబాలు చాలానే ఉన్నాయి. కొవిడ్ వైద్యం కోసం ఇల్లు, ఆస్తులు అమ్ముకుని, చివరకు అయినవారినీ కోల్పోయి ఏమీ లేనివారిగా మిగిలినవారిని కూడా చూశాం. ఇలాంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయం కంటితుడుపు మాత్రమే. అయితే ఆయా కుటుంబాల ఆర్థిక కష్టాలు తీర్చేందుకు బాధిత కుటుంబ సభ్యులకు ఉపాధి చూపించేందుకు ముందుకొచ్చింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. కొన్ని ప్రైవేటు సంస్థలు నేరుగా ఆర్థికసాయం అందిస్తున్నా.. టీసీఎస్ మాత్రం ఉపాధి మార్గం వెదికి పెడుతోంది. గతేడాది ఆగస్ట్ లో కొవిడ్ బాధిత కుటుంబాల పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టిన టీసీఎస్ మొత్తం లక్షా 24వేలమందికి శిక్షణ ఇస్తామని చెబుతోంది.

ఇప్పటి వరకూ 15వేలమంది ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు ఉద్యోగాల్లో చేరిపోయారు. టీసీఎస్ తో సహా ఇతర కంపెనీల్లో కూడా వీరికి ఉపాధి దొరికింది. ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి రెండేళ్లపాటు ఉపాధితో కూడిన శిక్షణ ఇస్తుండగా, నాన్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి 90 రోజుల ట్రైనింగ్ ఉంటుంది. కొవిడ్ తో చనిపోయినవారి కుటుంబాలనుంచి వచ్చే విద్యార్థులకోసమే ఇలా ట్రైనింగ్ క్యాంప్ లు నిర్వహిస్తున్నట్టు తెలిపింది టీసీఎస్.

కొత్త ఏడాది 78వేల నియామకాలు..
మరోవైపు వచ్చే ఏడాదిలో మొత్తం 78వేల మంది ఫ్రెషర్స్ కి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్టు టీసీఎస్ ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ 40వేలమందికి ఉద్యోగాలిచ్చామని తెలిపింది. ఐటీ రంగంలో నిపుణులకు మంచి అవకాశాలున్నాయని, కొత్తగా వచ్చేవారికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. కరోనా కాలంలో ఐటీరంగం ఒక్కటే ఒడిదొడుకులు లేకుండా ఉంది. మిగతా రంగాల్లో ఉద్యోగాల్లో కోతలు ఎదురైనా, ఐటీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పేరుతో ఇంటికే పరిమితమై ఉద్యోగాలు చేశారు. ఇప్పుడిప్పుడే వీరంతా ఆఫీస్ బాట పడుతున్నారు.

First Published:  8 Oct 2021 11:12 PM GMT
Next Story