Telugu Global
National

బర్త్ డే.. హాలిడే.. ఢిల్లీ పోలీసులకు బంపర్ ఆఫర్..

పోలీస్ డ్యూటీ అంటే సెలవలుండవు, పండగలు, పబ్బాలకు కూడా రోడ్డుపై పహారా కాస్తూ డ్యూటీ చేయాల్సిందేననే అపవాదు ఉంది. ఇక వీక్లీ ఆఫ్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అధికారికంగా వారాంతపు సెలవలున్నా కూడా సిబ్బంది కొరతతో అనధికారికంగా వారు డ్యూటీ చేయాల్సిందే. అయితే ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీ పరిధిలో డ్యూటీ చేస్తున్న 80వేలమంది సిబ్బందికి శుభవార్త చెప్పింది. ఇకపై పోలీస్ కానిస్టేబుల్ అయినా, […]

బర్త్ డే.. హాలిడే.. ఢిల్లీ పోలీసులకు బంపర్ ఆఫర్..
X

పోలీస్ డ్యూటీ అంటే సెలవలుండవు, పండగలు, పబ్బాలకు కూడా రోడ్డుపై పహారా కాస్తూ డ్యూటీ చేయాల్సిందేననే అపవాదు ఉంది. ఇక వీక్లీ ఆఫ్ ల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. అధికారికంగా వారాంతపు సెలవలున్నా కూడా సిబ్బంది కొరతతో అనధికారికంగా వారు డ్యూటీ చేయాల్సిందే. అయితే ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీ పరిధిలో డ్యూటీ చేస్తున్న 80వేలమంది సిబ్బందికి శుభవార్త చెప్పింది.

ఇకపై పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఉన్నతాధికారి అయినా.. వారి పుట్టినరోజున డ్యూటీకి రావాల్సిన పని లేదు. అంతే కాదు పెళ్లైతే భార్య, లేదా భర్త పుట్టినరోజు కూడా కుటుంబంతోనే గడిపే అవకాశం ఇస్తారు. పిల్లలుంటే.. వారి పుట్టినరోజు కూడా పోలీసులకు సెలవే. ఇలా కుటుంబంలో పుట్టినరోజైనా, పెళ్లి రోజైనా.. ఆ రోజు ఆఫీస్ కి రావాల్సిన అవసరం లేదని, సెలవు తీసుకోవచ్చని ఉత్తర్వులిచ్చారు. ఐటీ విభాగం డీసీపీ మహేష్ బత్రా పేరుతో ఈ ఆర్డర్స్ వెలువడ్డాయి. వెంటనే ఇవి అమలులోకి వస్తాయని, ఇందులో ఎలాంటి అత్యవసర మినహాయింపులుండవని కూడా పేర్కొన్నారు.

వాస్తవానికి కరోనా కష్టకాలంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమైన సందర్భాల్లో పోలీసులు, వైద్యులు, ఇతర అత్యవసర సేవలున్నవారు 24గంటలు డ్యూటీలు చేశారు. పోలీసులు రోడ్లపై పహారా కాస్తూ.. మీకోసం మేం రోడ్లపైకి వచ్చాం, మీ ప్రాణాలకోసం కోసం మీరు ఇళ్లలోనే ఉండండి అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. సహజంగానే పోలీసులకు సెలవలు తక్కువ. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు ఢిల్లీ విభాగం ఉన్నతాధికారులు. ప్రభుత్వంతో చర్చించి ఉత్తర్వులు విడుదల చేశారు.

First Published:  8 Oct 2021 9:12 PM GMT
Next Story