Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా ప్రకటించిన ప్రభాస్

ప్రభాస్ అస్సలు తగ్గేలా లేడు. మినిమం గ్యాప్స్ లో సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇంకో సినిమా ఎనౌన్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నాడు. దీనికి ‘స్పిరిట్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి […]

మరో సినిమా ప్రకటించిన ప్రభాస్
X

ప్రభాస్ అస్సలు తగ్గేలా లేడు. మినిమం గ్యాప్స్ లో సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నాడు. తాజాగా ఇంకో సినిమా ఎనౌన్స్ చేశాడు. గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది.

రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నాడు.
దీనికి ‘స్పిరిట్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దర్శక
నిర్మాతల నుంచి విడుదలైంది.

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్
హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటివరకు రెబెల్
స్టార్ ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా
చూపించబోతున్నాడు.

టి సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషలతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్.. రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నాడు.

First Published:  7 Oct 2021 8:16 AM GMT
Next Story