Telugu Global
Cinema & Entertainment

ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసిపోని విధంగా, అసోసియేషన్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అభ్యర్థులిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ఒక మాట అంటే, మంచు విష్ణు రెండు మాటలు విసురుతున్నాడు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఈరోజు ఉన్నట్టుండి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రకాష్ రాజ్. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన ”మా” సభ్యులు, ఓటింగ్ కు […]

ప్రకాష్ రాజ్ కు మంచు విష్ణు వార్నింగ్
X

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం
తీసిపోని విధంగా, అసోసియేషన్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. అభ్యర్థులిద్దరూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ ఒక మాట అంటే, మంచు విష్ణు రెండు మాటలు విసురుతున్నాడు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది.

ఈరోజు ఉన్నట్టుండి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టాడు ప్రకాష్ రాజ్. కరోనా నేపథ్యంలో 60 ఏళ్లు దాటిన ”మా”
సభ్యులు, ఓటింగ్ కు రావాల్సిన అవసరం లేకుండా నిబంధనలు మార్చారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని
వాడుకునే వెసులుబాటు కల్పించారు. దీన్ని మంచు విష్ణు ప్యానెల్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు ప్రకాష్ రాజ్. దాదాపు ఓ 50 మంది తరఫున మంచు విష్ణు మనుషులే లెటర్స్ ఇచ్చేసి, డబ్బులు కూడా కట్టేశారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన కొన్ని ఆధారాలు కూడా చూపించారు.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై మంచు విష్ణు వెంటనే స్పందించాడు. ప్రకాష్ రాజ్ ఆరోపణల్ని తిప్పికొట్టాడు.
తామిచ్చింది బ్యాలెట్ పేపర్లు కాదని, పోస్టల్ బ్యాలెట్ కు సమ్మతి తెలుపుతూ.. బ్యాలెట్ పేపర్ ను తమకు
పంపించాలనే అభ్యర్థ పత్రాన్ని మాత్రమే సమర్పించామని, ఆ మేరకు పోస్టల్ ఓటింగ్ ఖర్చుల్ని కూడా ఆ
కొంతమంది సభ్యుల తరఫున తాము చెల్లించామని అన్నారు.

ఇదంతా అభ్యర్థుల అనుమతితోనే జరిగిందని, వాళ్ల సౌలభ్యం కోసం చేశామే తప్ప, తమ ఓట్ల కోసం
కాదన్నారు విష్ణు. బ్యాలెట్ పత్రం ఇంటికొచ్చిన తర్వాత ఎవరికి ఓటు వేయాలనేది అభ్యర్థి ఇష్టమని అన్నారు. ఈమాత్రం దానికే ప్రకాష్ రాజ్ రాద్దాంతం చేస్తున్నారని మంచు విష్ణు మండిపడ్డారు.

First Published:  5 Oct 2021 7:19 AM GMT
Next Story