Telugu Global
Cinema & Entertainment

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద ఎవ్వరూ లేరు

పైకి చిరంజీవిని తన ఫ్రెండ్ గా చెప్పుకునే మోహన్ బాబు.. ఇండస్ట్రీ పెద్దగా మాత్రం చిరంజీవిని ఒప్పుకోనని పరోక్షంగా తేల్చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన మోహన్ బాబు..ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద ఎవ్వరూ లేరన్నారు. “సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేరు. దాసరితోనే ఆ పెద్దరికం పోయింది. చిరంజీవి ఆ స్థానం కోసం ప్రయత్నిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇంతకుమించి నేను స్పందించలేను. ఒక్కటి మాత్రం చెప్పగలను, మా గురువుగారు దాసరితో ఎవ్వర్నీ పోల్చలేం. […]

ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద ఎవ్వరూ లేరు
X

పైకి చిరంజీవిని తన ఫ్రెండ్ గా చెప్పుకునే మోహన్ బాబు.. ఇండస్ట్రీ పెద్దగా మాత్రం చిరంజీవిని ఒప్పుకోనని పరోక్షంగా తేల్చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన మోహన్ బాబు..ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్ద ఎవ్వరూ లేరన్నారు.

“సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేరు. దాసరితోనే ఆ పెద్దరికం పోయింది. చిరంజీవి ఆ స్థానం కోసం
ప్రయత్నిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఇంతకుమించి నేను స్పందించలేను. ఒక్కటి మాత్రం
చెప్పగలను, మా గురువుగారు దాసరితో ఎవ్వర్నీ పోల్చలేం. ఆయన స్థానం భర్తీ కాదు.”

ఇలా చిరంజీవి పెద్దరికాన్ని అంగీకరించలేదు మోహన్ బాబు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
ఎన్నికలపై కూడా సూటిగా స్పందించారు. ఏకగ్రీవం కోసం తనను ఎవ్వరూ సంప్రదించలేదన్నారు.

“చిరంజీవి, నేను స్నేహితులం. ఇప్పటికీ, ఎప్పటికీ మేం స్నేహితులమే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
ఎన్నికలకు సంబంధించి మా మధ్య ఎలాంటి చర్చ జరగలేదు. నిజంగా చిరంజీవి కొడుకు, అరవింద్ కొడుకు లేదా నాగార్జున కొడుకు అధ్యక్ష బరిలో ఉండి ఉంటే నేనే స్వచ్ఛందంగా విష్ణుతో నామినేషన్
ఉపసంహరించుకోమని చెప్పేవాడ్ని. నేనే దగ్గరుండి ఏకగ్రీవం చేసేవాడ్ని. కానీ ఇప్పుడలా జరగలేదు. ప్రకాష్ రాజ్ నాకు వ్యక్తిగత స్నేహితుడు కాదు, ఆయన సినీ స్నేహితుడు మాత్రమే.”

ఓ సినిమా ఫంక్షన్ లో పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు తప్పకుండా స్పందిస్తానన్నారు మోహన్ బాబు. ఇండస్ట్రీకి చెందిన ఓ పెద్ద హీరో తనను ప్రశ్నించినప్పుడు, ఆ హీరోకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కచ్చితంగా పవన్ ప్రశ్నలకు జవాబు చెప్పి తీరతానన్నారు.

First Published:  4 Oct 2021 10:38 AM GMT
Next Story