Telugu Global
Health & Life Style

కొవిడ్ రోగులపై మోల్నుపిరవిర్ ప్రభావం ఎంత..?

కొవిడ్ చికిత్సకు మోల్నుపిరవిర్ మాత్ర దివ్యౌషధం అంటూ ఇటీవల మెర్క్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మోల్నుపిరవిర్ వాడిన కొవిడ్ రోగులు ఆస్పత్రి పాలయ్యే అవకాశం 50శాతానికి తగ్గిందని, మరణాల సంఖ్య కూడా సగానికి సగం తగ్గిందని కంపెనీ తెలిపింది. మోల్నుపిరవిర్ క్లినికల్ ట్రయల్స్ లో అత్యంత ఆశాజనకమైన రిజల్ట్ వచ్చాయని తాజాగా మెర్క్ కంపెనీ ప్రకటించింది. మోల్నుపిరవిర్ తో పాటు, ప్లాసిబో(ఔషధం లేని) మాత్రలతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ప్లాసిబో […]

కొవిడ్ రోగులపై మోల్నుపిరవిర్ ప్రభావం ఎంత..?
X

కొవిడ్ చికిత్సకు మోల్నుపిరవిర్ మాత్ర దివ్యౌషధం అంటూ ఇటీవల మెర్క్ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మోల్నుపిరవిర్ వాడిన కొవిడ్ రోగులు ఆస్పత్రి పాలయ్యే అవకాశం 50శాతానికి తగ్గిందని, మరణాల సంఖ్య కూడా సగానికి సగం తగ్గిందని కంపెనీ తెలిపింది. మోల్నుపిరవిర్ క్లినికల్ ట్రయల్స్ లో అత్యంత ఆశాజనకమైన రిజల్ట్ వచ్చాయని తాజాగా మెర్క్ కంపెనీ ప్రకటించింది. మోల్నుపిరవిర్ తో పాటు, ప్లాసిబో(ఔషధం లేని) మాత్రలతో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ప్లాసిబో తీసుకున్నవారిలో 14శాతం మంది ఆస్పత్రిపాలవడంకానీ, మరణించడం కానీ జరిగింది. అదే సమయంలో మోల్నుపిరవిర్ తీసుకున్నవారిలో కేవలం 7.3 శాతం మంది మాత్రమే ఆస్పత్రిపాలయ్యే స్థితికి చేరుకున్నారు. అంటే సగానికి సగం మందిపై మోల్నుపిరవిర్ కచ్చితమైన ప్రభావం చూపించింది.

ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తే మోల్నుపిరవిర్ సమర్థతపై మరింత కచ్చితత్వమైన సమాచారం లభిస్తుందని అంటున్నారు నిపుణులు. త్వరలో ఈ సమాచారాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కి మెర్క్ కంపెనీ ఇవ్వబోతోంది. ఈ సమాచారంతో మోల్నుపిరవిర్ కి అత్యవసర వినియోగ అనుమతి లభిస్తుందని అంటున్నారు.

ఐదురోజుల చికిత్స..
కరోనా లక్షణాలు తక్కువగా లేదా ఓ మోస్తరుగా ఉన్న రోగులకు మోల్నుపిరవిర్ ను చికిత్సలో భాగంగా అందించారు. మొదటి ఐదు రోజులపాటు ఈ మాత్రల్ని అందించారు. సాధారణ రోగులతోపాటు.. స్థూలకాయం, షుగర్, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు కూడా ఇందులో ఉన్నారు. వారిపై కూడా మోల్నుపిరవిర్ సమర్థంగా పనిచేసిందని తెలుస్తోంది. EIDD-2801 అనే పేరుతో మెర్క్ కంపెనీ దీన్ని మార్కెట్ చేయాలని చూస్తోంది.

మోల్నుపిరవిర్ చికిత్స ఖర్చు ఎంత..?
మోల్నుపిరవిర్ కోర్సు ఖరీదు 700 డాలర్లు, అంటే 50వేల రూపాయలుగా నిర్థారించారు. ఇది యాంటీబాడీ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కంటే చాలా తక్కువ. ఈ ఏడాది చివరికల్లా కోటి కోర్స్ ల తయారీకి మెర్క్ కంపెనీ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాదికి వీటి సంఖ్య మరింత పెంచాలనుకుంటోంది. అత్యవసర అనుమతి లభించిన వెంటనే.. మోల్నుపిరవిర్ ను మార్కెట్ లోకి తెచ్చేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.

First Published:  3 Oct 2021 11:00 AM GMT
Next Story