Telugu Global
International

స్పెయిన్ కోర్టు వింత తీర్పు.. రోడ్డెక్కిన మహిళలు..

మహిళల భద్రతకు సంబంధించి విదేశాల్లో కఠిన చట్టాలుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు మాత్రం మరీ విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన తీర్పునిచ్చింది స్పెయిన్ లోని ఓ కోర్టు. మహిళలు మూత్రవిసర్జన చేసే సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి, వాటిని పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేయడం నేరం ఎంతమాత్రం కాదని తీర్పునిచ్చింది. దీంతో అక్కడి మహిళాలోకం రోడ్డెక్కింది. ఆ తీర్పుని సరిదిద్దాలంటూ ఆందోళనకు దిగింది. అసలేం జరిగింది..? కరోనా కష్టకాలానికి ముందు స్పెయిన్ […]

స్పెయిన్ కోర్టు వింత తీర్పు.. రోడ్డెక్కిన మహిళలు..
X

మహిళల భద్రతకు సంబంధించి విదేశాల్లో కఠిన చట్టాలుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు మాత్రం మరీ విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన తీర్పునిచ్చింది స్పెయిన్ లోని ఓ కోర్టు. మహిళలు మూత్రవిసర్జన చేసే సమయంలో దొంగచాటుగా వీడియోలు తీసి, వాటిని పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేయడం నేరం ఎంతమాత్రం కాదని తీర్పునిచ్చింది. దీంతో అక్కడి మహిళాలోకం రోడ్డెక్కింది. ఆ తీర్పుని సరిదిద్దాలంటూ ఆందోళనకు దిగింది.

అసలేం జరిగింది..?
కరోనా కష్టకాలానికి ముందు స్పెయిన్ లో జరిగిన ఓ ఉత్సవంలో జనం భారీగా పాల్గొన్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి వచ్చేశారు. అయితే ఆ సమయంలో కొంతమంది మహిళలకు మూత్ర విసర్జన సమస్యగా మారింది. దగ్గర్లో పబ్లిక్ టాయిలెట్లు లేవు, ఏంచేయాలో తెలియక.. ఓ చిన్న సందులో బహిరంగ ప్రదేశంలోనే వారు మూత్రవిసర్జన చేశారు. సరిగ్గా అదే సమయంలో కొంతమంది ఆకతాయిలు వారి వీడియోలను తీశారు. ఇలా మొత్తం 80మంది మహిళలు, యువతుల వీడియోలను తీసిన ఆకతాయిలు వాటిని నేరుగా పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేశారు. కొంత కాలానికి ఆ వీడియోలు వైరల్ కావడంతో సదరు బాధిత మహిళలు కోర్టు కెక్కారు.

కోర్టు ఏం చెప్పింది..?
బహిరంగ ప్రదేశాల్లో వీడియోలు తీయడం నేరం కాదు. ఉత్సవం సందర్భంగా కొంతమంది యువకులు వీడియోలు తీస్తున్న సందర్భంలో మహిళలు అక్కడ మూత్ర విసర్జన చేశారు. అది కూడా బహిరంగ ప్రదేశమే కాబట్టి వారిని తప్పుబట్టడానికి వీల్లేదు, అలా తీసిన వీడియోలను వారు వెబ్ సైట్స్ లో పెట్టడం కూడా నేరం కాదు.. అంటూ స్పెయిన్ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో మహిళలు భగ్గుమన్నారు. కోర్టు తీర్పుకి వ్యతిరేకంగా స్పెయిన్ లో రోడ్లపై ఆందోళనకు దిగారు. ప్రపంచ వ్యాప్తంగా తమ ఉద్యమానికి మద్దతుకూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆకతాయిలకు కోర్టు మద్దతు తెలపడం సరికాదంటూ.. మహిళా సంఘాలన్నీ ముక్త కంఠంతో ఈ తీర్పుని వ్యతిరేకిస్తున్నాయి.

First Published:  1 Oct 2021 9:16 PM GMT
Next Story