Telugu Global
Cinema & Entertainment

దసరా బరిలో మరో సినిమా

దసరా బరిలో ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను, మహాసముద్రం సినిమాలున్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో సినిమా రెడీ అవుతోంది. అదే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లిసందD సినిమా. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన రాఘవేంద్రరావు.. ‘పెళ్లిసంద‌D’ తో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల […]

pelli sandadi
X

దసరా బరిలో ఇప్పటికే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వరుడు కావలెను, మహాసముద్రం సినిమాలున్నాయి.
ఇప్పుడు వీటికి పోటీగా మరో సినిమా రెడీ అవుతోంది. అదే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లిసందD సినిమా.

ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన రాఘవేంద్రరావు.. ‘పెళ్లిసంద‌D’ తో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నారు.

మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లిసంద‌డి'లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌.

First Published:  2 Oct 2021 7:24 AM GMT
Next Story