Telugu Global
NEWS

కొంప ముంచిన కోవాక్సిన్.. చెస్ పోటీలకు హంపి దూరం..

మేడిన్ ఇండియా టీకా అంటూ భారత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న కోవాక్సిన్ వల్ల ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంది. ఆమె రెండు డోసుల కోవాక్సిన్ టీకా తీసుకున్నా కూడా స్పెయిన్ లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ కు వెళ్లలేకపోయింది. కోవాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం. స్పెయిన్ లో జరుగుతున్న ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్ పోటీలపై […]

కొంప ముంచిన కోవాక్సిన్.. చెస్ పోటీలకు హంపి దూరం..
X

మేడిన్ ఇండియా టీకా అంటూ భారత ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్న కోవాక్సిన్ వల్ల ఆంధ్రప్రదేశ్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అద్భుతమైన అవకాశాన్ని చేజార్చుకుంది. ఆమె రెండు డోసుల కోవాక్సిన్ టీకా తీసుకున్నా కూడా స్పెయిన్ లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్ షిప్ కు వెళ్లలేకపోయింది. కోవాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా అనుమతి ఇవ్వకపోవడమే దీనికి కారణం.

స్పెయిన్ లో జరుగుతున్న ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ షిప్ పోటీలపై హంపి ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ పోటీల్లో ఆమె టైటిల్ ఫేవరెట్ క్రీడాకారిణి. అయితే చివరి నిమిషంలో పోటీకి వెళ్లడానికి వ్యాక్సిన్ అడ్డంకిగా మారడంతో హంపి తీవ్ర నిరాశకు లోనైంది. కోవాక్సిన్ కు స్పెయిన్ లో అత్యవసర వినియోగ అనుమతి లేదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా లేదు. ఒకవేళ కోవాక్సిన్ తీసుకున్నవారు స్పెయిన్ కి వెళ్లినా అక్కడ 10రోజులపాటు క్వారంటైన్ లో ఉండాలి. ఆలోపు పోటీలు ముగిసిపోతాయి. నేరుగా భారత్ నుంచి కాకుండా, నార్త్ మెసిడోనియా మీదుగా కూడా స్పెయిన్ కి వెళ్లే అవకాశం ఉన్నా అది కూడా కుదరలేదు. అక్కడ కూడా 10రోజుల క్వారంటైన్ తప్పనిసరి అనడంతో అసలు పోటీకి వెళ్లకుండానే విరమించుకుంది హంపి. చివరి నిముషంలో స్పెయిన్ కి బయలుదేరే సమయంలో అక్కడి రాయబార కార్యాలయాన్ని సంప్రదించడంతో క్వారంటైన్ నియమాలు చెప్పారు. దీంతో హంపి ప్రయాణం విరమించుకున్నారు, పోటీనుంచి తప్పుకున్నారు.

ఇక హంపికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేసిన పద్మిని రౌత్‌ కు కూడా అదే సమస్య ఎదురైంది. పద్మిని కూడా కోవాక్సిన్ టీకా తీసుకోవడంతో ఆమె కూడా స్పెయిన్‌ వెళ్లలేకపోయింది. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్త ఉత్పాదన అయిన కోవిషీల్డ్ కి మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతితోపాటు.. 122 దేశాల్లో అనుమతి ఉంది.

First Published:  1 Oct 2021 1:48 AM GMT
Next Story